For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

39 వేల దిగువన సెన్సెక్స్, మళ్లీ నష్టాల్లో ముగింపు

By Chanakya
|

సెలవు తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా బలహీనంగానే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా కొద్దిగా బ్యాంకుల్లో నీరసం మార్కెట్లను కిందపడేసింది. ప్రధానంగా ప్రైవేట్ బ్యాంకులైన ఐసిఐసిఐ, ఇండస్ ఇండ్‌లో లాభాల స్వీకరణ ఓవరాల్ నిఫ్టీపై ప్రభావం చూపింది. నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు రెండూ అర శాతానికి పైగా నష్టపోయాయియ. ఒక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల బాటలోనే నడిచాయి. చివరకు నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 11724 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 50 పాయింట్లు నష్టంతో 38,982 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ 57 పాయింట్ల నష్టపోయింది.

<strong>నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!</strong>నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!

ప్రధానంగా మీడియా, ఫార్మా, ఐటీ రంగ కౌంటర్లలో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి నమోదైంది. రూపాయి తేరుకోవడంతో ఐటీ స్టాక్స్‌పై ప్రభావం చూపించింది. ప్రధానంగా టాటా ఎలిక్సి 4.5 శాతం, ఇన్ఫోసిస్ 3 శాతం, ఒరాకిల్ ఫైనాన్షియల్ 2.5 శాతం నష్టపోయాయి. ప్రధాన స్టాక్స్ అయిన టీఎస్, విప్రో 2 శాతం వరకూ కోల్పోయాయి.

Stock market indices closed on weak note for the second consecutive day

మెక్‌లాయిడ్ రసెల్ - ఎవరెడీ భారీ నష్టం

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రెండు కంపెనీల స్టాక్స్ ఈ రోజు మార్కెట్లో మరింత డీలా పడ్డాయి. రేటింగ్ కంపెనీలు డౌన్ గ్రేడ్ చేయడంతో టీ తయారీ, సరఫరా సంస్థ మెక్‌లాయిడ్ ఇంట్రాడేలో రూ. 48.80 స్థాయికి పడిపోయింది. చివరకు 16 శాతం నష్టంతో రూ.51.20 దగ్గర ముగిసింది. ఇదే గ్రూపునకు చెందిన బ్యాటరీల తయారీ సంస్థ ఎవరెడీ కూడా 8 శాతం వరకూ కోల్పోయి రూ.107.95 దగ్గర ముగిసింది.

యెస్ బ్యాంక్ మళ్లీ తేరుకుంది

మొన్నటి ట్రేడింగ్‌లో 20 శాతం వరకూ కుప్పకూలిన యెస్ బ్యాంక్ షేర్ ఈ రోజు కొద్దిగా తేరుకుంది. 5 శాతం వరకూ లాభపడింది. ఇంట్రాడేలో రూ.178 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు 3.5 శాతం లాభపడి రూ.174 దగ్గర ముగిసింది.

ఆటో.. దారి మారుతోంది

ఏప్రిల్ నెల వాహన అమ్మకాలు వివిధ కంపెనీలను నిరుత్సాహ పరిచాయి. ప్రధానంగా మారుతి సుజుకి అమ్మకాల వృద్ధి ఏడు సంవత్సరాల కనిష్ట స్థాయికి పడపోయింది. ఈ సంవత్సరం వృద్ధి కూడా 3-5 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చనే అంచనాలు ప్రారంభంలో మారుతి సుజుకి షేర్‌ను పడేశాయి. చివరకు కొద్దిగా కోలుకుని ఫ్లాట్‌గా రూ.6670 దగ్గర ముగిసింది. ఇదే బాటలో టీవీఎస్ మోటార్స్ 2.5 శాతం, టాటా మోటార్స్ 3.5 శాతం నష్టపోయాయి. ఎస్కార్ట్స్ సేల్స్ ఏకంగా 17 శాతం పడిపోవడంతో స్టాక్ 8 శాతం నష్టపోయి రూ.681 దగ్గర ముగిసింది. మెరుగైన అమ్మకాలను నమోదు చేసిన అశోక్ లేల్యాండ్ 3 శాతానికి పైగా పెరిగితే, హీరో మోటో - బజాజ్ ఆటో రెండు శాతం వరకూ పెరిగాయి.

జెట్ మళ్లీ కుదేల్

జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు బిడ్డర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో మెల్లిగా ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఈ స్టాక్ ఈ రోజు కూడా 20 శాతం వరకూ పతనమైంది. ఇంట్రాడేలో రూ.119 స్థాయికి దిగిరావడంతో పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు 12 శాతం నష్టంతో రూ.135.40 దగ్గర క్లోజైంది.

నెరోలాక్‌కు రంగు పడింది

కన్సాయ్ నెరోలాక్‌ నిరుత్సాహక నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయం 4.5 శాతం మాత్రమే పెరిగితే, ఎబిటా 11.4 శాతం క్షీణించింది. మార్జిన్లు 2.3 శాతం తగ్గితే, నికర లాభం 12.3 శాతం దిగొచ్చింది. దీంతో ఈ స్టాక్ 12 శాతం ఏకంగా ఆరేడు శాతం నష్టపోయింది. చివరకు రూ.419 దగ్గర ముగిసింది.

ఇదే బాటలో ప్రముఖ ఎఫ్ఎంసిజి సంస్థ డాబర్ ఇండియా నిరుత్సాహక ఫలితాలతో అంచనాలను తలకిందులు చేసింది. ఆదాయం 5 శాతం పెరిగితే, నికర లాభం 6.5 శాతం పడిపోయింది. ఎబిటా 5.8 శాతం నీరసించింది. మార్జిన్లు 23.9 నుంచి 21.5 శాతానికి దిగింది. దీంతో ఈ స్టాక్ కూడా 4.12 శాతం నష్టంతో రూ.382 దగ్గర క్లోజైంది.

భారీ వాల్యూమ్స్

గాయత్రి ప్రాజెక్ట్స్ స్టాక్ 5.5 శాతం లాభపడి రూ.168 దగ్గర క్లోజైంది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 14 రెట్లు పెరిగాయి. కుద్రేముఖ్ ఐరన్ ఓర్ స్టాక్ కూడ్ 4 శాతం వరకూ లాభపడింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 10 రెట్లకు పైగా పెరిగాయి. అజంతా ఫార్మా స్టాక్ ఇంట్రాడేలో 10 శాతానికి పైగా లాభపడింది. చివర్లో కొద్దిగా తడబడినా 8 శాతానికి పైగానే పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ 9 రెట్లు పెరిగాయి.

English summary

39 వేల దిగువన సెన్సెక్స్, మళ్లీ నష్టాల్లో ముగింపు | Stock market indices closed on weak note for the second consecutive day

Stock market indices closed on weak note for the second consecutive day. After a gap of holiday on account of May day markets started with a flat note in the opening. During the mid session selling pressure intensified and markets plunged into red zone. finally sensex closed below sentiment number of 39000.
Story first published: Thursday, May 2, 2019, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X