బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి దేశీయ వంట నూనెల మార్కెట్‌పై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రుచి సోయా కంపెనీ టేకోవర్ కోసం రూ.4,350 కోట్ల బిడ్ సమర్పించింది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఎక్కువ శాతం ఈ బిడ్‌కు ఆమోదం తెలిపారని తెలుస్తోంది. పతంజలి కనుక దీనిని తీసుకుంటే రుణదాతలకు రావాల్సిన వాటిల్లో దాదాపు సగం శాతం రానున్నాయి. ఎస్బీఐ సహా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.9,345 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో 49 శాతం వసూలు అవుతాయి.
ఎస్బీఐకి రూ.1,822 కోట్లతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, ఐడీబీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంకు, డీబీఎస్ బ్యాంక్ సింగపూర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.

రుచి సోయాపై అందుకే పతంజలి దృష్టి
రూ.1,700 కోట్ల వర్కింగ్ కేపిటల్ నిధులతో రుచి సోయా కంపెనీకి చెందిన 24 ప్లాంట్లను మళ్లీ ఉత్పత్తికి సిద్ధం చేస్తామని పతంజలి తమ బిడ్‌లో పేర్కొంది. అయితే తమ రుణాల్లో యాభై శాతానికి పైగా వదులుకోవడం బ్యాంకర్లకు ఇబ్బందిగా మారింది. ఈ నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తే, మరో పరిష్కార ప్రణాళికతో ముందుకు వస్తామని పతంజలి తెలిపింది. ప్రస్తుతం పతంజలి ఆయుర్వేద్ కంపెనీ.. ఆయుర్వేద్, ఆహార ఉత్పత్తులపై దృష్టి సారించింది. వంట నూనెలు కూడా ఉన్నప్పటికీ అంతగా లేవు. 2030 నాటికి వంట నూనెల మార్కెట్ 3.4 కోట్ల టన్నులకు చేరుకుంటుందని అంచనా. అదానీ గ్రూప్‌కు చెందిన ఫార్చూన్ బ్రాండ్ 19 శాతం వాటా, రుచి సోయా ఐదు బ్రాండ్లతో 14 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పుడు దివాళా పరిష్కార ప్రక్రియలో ఉన్న రుచి సోయాను కొనుగోలు చేసి, వంట నూనెల మార్కెట్లో సత్తా చాటాలని పతంజలి చూస్తోంది.

పతంజలి టార్గెట్
పతంజలి కంపెనీ రెండేళ్ల క్రితం వరకు మంచి వృద్ధి రేటు కలిగి ఉంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి రేటుతో రూ.10,561 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఆ తర్వాత ఏడాది 20 శాతానికి పడిపోయింది. నోట్ల రద్దు, జీఎస్టీకి తోడు ఇతర కంపెనీలు ఆయుర్వేద ఉత్పత్తులు తీసుకు రావడమే కారణం. 2018-19 ఆర్థిక సంవత్సరంలోను టర్నోవర్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవని అంటున్నారు. రానున్న అయిదేళ్లలో రూ.25 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకుంది. రుచి సోయా కూడా ఇందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. రుచి సోయాకు 24 ప్లాంట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 37 లక్షల టన్నుల నూనె గింజల సామర్థ్యం ఉంది. ఆరు వంట నూనెల బ్రాండ్లు ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా పంతజలి, సోయా మధ్య పలు ఒప్పందాలు ఉన్నాయి.

రుచి సోయా బ్రాండ్స్
రుచి సోయా 15 డిసెంబర్ 2017లో కార్పోరేట్ దివాలా తీర్మాన ప్రక్రియలో చేర్చబడింది. స్టాండర్డ్ చార్డర్డ్ బ్యాంక్, దేనా బ్యాంకు ఫిర్యాదుతో ఇది చోటు చేసుకుంది. రుచి సోయాలో న్యూట్రేలా, సన్‌రిచ్, మహాకోష్, రుచి గోల్డ్, రుచి స్టార్ బ్రాండ్లు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications