రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు: ఏప్రిల్‌లో రూ.1.13 కోట్లు, ఇవి కూడా కారణం

గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్ (జీఎస్టీ) రెవెన్యూ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.1.13 లక్షల కోట్లకు (రూ.1.13 ట్రిలియన్లు) చేరుకుంది. గత ఏడాది ఏప్రిల్ (2018) నెలలోని రూ.1.03 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. 1 జూలై 2017 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. నాటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెలలో అత్యధికంగా పన్ను వసూలు కావడం ఇదే తొలిసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలలో రూ.1.06 లక్షల కోట్లు వసూలయ్యాయి. దీంతో పోల్చినా ఎక్కువే.

జీఎస్టీ వసూళ్లు ఇలా

జీఎస్టీ వసూళ్లు ఇలా

రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ.21,163 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.28,801 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.54,733 కోట్లు, సెస్‌ రూ.9,168 కోట్లు ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం వరుసగా ఇది రెండో నెల. గత మార్చి, ఇప్పుడు ఏప్రిల్ నెలలో దాటాయి. నెలవారీ దాఖలు చేసే జీఎస్టీ 3బీల సంఖ్య 72.13 లక్షలు నమోదయ్యాయి. సాధారణ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఐ-జీఎస్టీనుంచి సీ-జీఎస్టీకి రూ.20,370 కోట్లు, ఎస్‌జీఎస్టీకి రూ.15,975 కోట్లు ప్రభుత్వం సెటిల్‌ చేసింది.

 సెంట్రల్ జీఎస్టీ అంచనా

సెంట్రల్ జీఎస్టీ అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2019-20) కేంద్రం సెంట్రల్ జీఎస్టీ నుంచి రూ.6.10 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోంది. పరిహార సెస్‌ కింద రూ.1.01 లక్షల కోట్ల వసూళ్లను ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఐజీఎస్టీ వసూళ్లు రూ.50,000 కోట్లు సాధించాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో సెంట్రల్ జీఎస్టీ ఆదాయం రూ.4.25 లక్షల కోట్లు, పరిహార సుంకం వసూళ్లు రూ.97,000 కోట్లుగా నమోదయ్యాయి.

 అందుకే పెరిగిన వసూళ్లు

అందుకే పెరిగిన వసూళ్లు

గత రెండేళ్ల కాలంలో పన్నుల వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయని, ఎగవేతలకు చెక్ పెట్టడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెబుతన్నారు. గతంలో పన్ను వసూళ్లు అ తర్వాత నెలలో మూడో వారంలో విడుదల చేసేది. ఇప్పుడు దీనిని నెల ముగిసిన మరుసటి రోజే ప్రకటిస్తోంది. పన్నులు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని, ఈ-వే బిల్లులపై కఠిన నిబంధనలు, రియల్ ఎస్టేట్ రంగంలో పన్నుల వసూళ్ల సరళి మార్పు కూడా కారణాలని అధికారులు చెబుతున్నారు. కాగా, జీఎస్టీ కాంపోజిషన్ స్కీం పరిధిలోకి వచ్చే వ్యాపారులు త్రైమాసికానికి ఒకసారి రిటర్న్స్ సమర్పించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రకటించింది. రిటర్న్స్ దాఖలు చేయాల్సిన గడువును వెల్లడించింది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి సంబంధించి అక్టోబరు 31లోపు, అక్టోబర్‌-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి జనవరి 31 లోపు, జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఏప్రిల్‌ 30లోపు రిటర్న్స్ దాఖలు చేయాలని వివరించింది. రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు కాంపోజిషన్‌ స్కీమ్‌ పరిధిలోకి వస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+