Airtel థ్యాంక్స్: రూ.299కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
ఎయిర్‌టెల్ వినూత్న ప్రోగ్రాం చేపట్టింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ పేరుతో ప్రారంభించిన ప్రోగ్రాంను విభిన్న సేవలు, కస్టమర్లకు వినూత్న అనుభవం ఇచ్చేలా విస్తృతం చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ సిద్ధమైంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ మరింత కంటెంట్, డివైజ్, సెక్యూరిటీ, సర్వీసెస్, టాప్ బ్రాండ్స్ ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకు రానుంది.
ఈ రంగంలో తొలిసారి థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు ఆమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలు అందిస్తోంది. రూ.299కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‍తో పాటు రోజుకు 2.5 జీబీ డేటా, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానుంది.

ఎయిర్‌టెల్ థ్యాంక్స్ సేవలు మూడు రకాలుగా... సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్ టయర్‌గా ఉండనున్నాయి. సిల్వర్ టయర్ అయితే ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ ఉచితం. గోల్డ్ టయర్ అయితే పై రెండింటితో పాటు టెలికమ్ బెనిఫిట్స్, ప్రీమియం కంటెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ప్లాటినమ్ టయర్ కింద ఈ-బుక్స్, ఈవెంట్స్, సేల్స్‌కు ఎక్స్‌క్లూజివ్ ఇన్‌వైట్స్ అండ్ ప్రియారిటీ యాక్సెస్ ఉంటాయి. ఎయిర్‌టెల్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌ను ప్రారంభించింది.


Click it and Unblock the Notifications