For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు, 30 శాతం పతనమైన యస్ బ్యాంక్ షేర్లు

|

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆరు పాయింట్ల నష్టంతో 11,748 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 39,032 పాయింట్ల నష్టంతో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, యస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, ఎవ్రిడే ఇండస్ట్రీ, రిలయన్స్ పవర్, ఆంధ్రా బ్యాంక్, ఐఎఫ్‌సీఐ, హీరో మోటార్ కార్ప్‌లు నష్టపోయాయి. యస్ బ్యాంకు షేర్లు 30 శాతం మేర నష్టపోయాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నాలుగు శాతం లాభాల్లో ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్ ఇండియా, ఏషియన్ పేయింట్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్‌లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

Markets Update: Sensex, Nifty pare losses, YES Bank slips 30%

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో యస్ బ్యాంకు షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక సెషన్‌లోనే దాదాపు 30 శాతం విలువ కోల్పోయింది. ఈ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించడంతో చాలా సంస్థలు దీని రేటింగ్‌ను తగ్గించాయి. ఈ ప్రభావం షేర్లపై పడింది. ఉదయం 213.50 వద్ద ప్రారంభమైన షేరు ఓ దశలో 30 శాతానికి పైగా పడిపోయింది. 165 వద్ద ట్రేడ్ అయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 166 వద్ద ముగిసింది. శుక్రవారం ఈ బ్యాంక్ రూ.1507 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు త్రైమాసికంలో 1,180 కోట్ల లాభాన్ని ప్రకటించింది.

English summary

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు, 30 శాతం పతనమైన యస్ బ్యాంక్ షేర్లు | Markets Update: Sensex, Nifty pare losses, YES Bank slips 30%

The S&P BSE Sensex ended the day at 39,032, down 36 points, or 0.09 per cent, with YES Bank, IndusInd Bank, Hero MotoCorp, Maruti Suzuki India, and Powergrid being among the top losers. The broader Nifty50 also slid 6.5 points, or 0.06 per cent, to 11,748.
Story first published: Tuesday, April 30, 2019, 17:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X