For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైదరాబాద్‌లో జొమాటో వేర్‌హౌస్: బెంగళూరు-ఢిల్లీ సహా ఈ 20 నగరాల్లో కూడా

|

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో 2020 చివరి నాటికి దేశంలో హైదరాబాద్ సహా 20 వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇటీవల ప్రకటన చేసింది. బీ2బీ ప్లాట్‌ఫామ్, హైపర్‌ప్యూర్ సేవల పరిధిని విస్తరించే ఉద్దేశ్యంలో భాగంగా ఢిల్లీతో పాటు మరో 19 నగరాల్లో గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు రూ.56 కోట్ల నిధులు ఖర్చు చేయనుంది. ఒక్కో గిడ్డంగిని ఏర్పాటు చేసేందుకు 2.8 కోట్ల నిధులు వెచ్చించనుంది. నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయి.

బెంగళూరువాసులకు సూచన: కాల్ డ్రాప్, నెట్ అంతరాయానికి ఛాన్స్బెంగళూరువాసులకు సూచన: కాల్ డ్రాప్, నెట్ అంతరాయానికి ఛాన్స్

ప్రస్తుతం బెంగళూరులో వేర్ హౌస్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ప్రారంభించింది. ఢిల్లీలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో దీనిని నిర్మించింది. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గిడ్డంగి ద్వారా రోజుకు 3వేల రెస్టారెంట్లకు సరఫరా చేయవచ్చు. ఢిల్లీ, బెంగళూరులతో పాటు హైదరాబాద్, ముంబై, పుణే, చెన్నై, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, నాగపూర్, లక్నో, వడోదర, కోయంబత్తూరు, కొచ్చి, ఆగ్రా, గోవా, సూరత్‌లలో వేర్ హౌస్‌లు నెలకొల్పనుంది.

Hyperpure by Zomato opens warehouse in Delhi, to open 20 more in India by end of 2020

అంతర్జాతీయ దేశాల్లో కూడా గిడ్డంగులను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు జొమాటో ప్రతినిధులు చెప్పారు. 18 నగరాల్లో 20 వేర్ హౌస్‍‌లు నిర్మిస్తామని తెలిపింది. కంబైన్డ్‌గా 90,000 MT సామర్థ్యం, 700,000 చదరపు అడుగులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

English summary

హైదరాబాద్‌లో జొమాటో వేర్‌హౌస్: బెంగళూరు-ఢిల్లీ సహా ఈ 20 నగరాల్లో కూడా | Hyperpure by Zomato opens warehouse in Delhi, to open 20 more in India by end of 2020

The warehouses would be set up in Delhi, Bengaluru, Mumbai, Pune, Chennai, Hyderabad, Kolkata, Jaipur, Ahmedabad, Chandigarh, Nagpur, Lucknow, Vadodara, Coimbatore, Kochi, Agra, Goa and Surat.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X