For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI నుంచి కనీసం ఒక నెల శాలరీ ఇప్పించండి: జెట్ ఉద్యోగుల వేడుకోలు

|

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఆదీనంలో ఉంది. గోయల్ తప్పుకున్న అనంతరం ఇటీవల బిడ్స్ స్వీకరించారు. మే 10వ తేదీన బిడ్స్ ఫైనల్ కానున్నాయి. దీని చేతిలో 50.5 శాతం ఈక్విటీ ఉంది. నిన్నటి వరకు ఎక్కువ శాతం వాటా కలిగిన నరేష్ గోయల్‌కు ఇప్పుడు 20 శాతం మాత్రమే ఉంది. దుబాయ్‌కి చెందిన ఎతిహాద్‌కు 24 శాతం వాటా ఉంది. జెట్ ప్రస్తుతం రూ.920 కోట్ల నష్టంలో ఉంది. ప్రస్తుతం జెట్ రుణాలు ఇచ్చిన బ్యాంకర్ల చేతిలో ఉంది.

<strong>జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగి ఆత్మహత్య</strong>జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగి ఆత్మహత్య

ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు తమకు గత ఆరు నెలల నుంచి వేతనాలు లేవని, కనీసం ఒక నెల జీతం అయినా ఇవ్వాలని ఎస్బీఐని కోరుతున్నారట. ప్రస్తుతం ఇది లెండర్ కమ్ ఇన్వెస్టర్.. ఇలా డ్యూయల్ రోల్ పోషిస్తోంది. కంపెనీని గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం జెట్ ఉద్యోగులు ఎస్బీఐని కంపెనీ న్యూ పేరెంట్‌గా చూస్తున్నారు. అందుకే తమ ఇబ్బందులు తీర్చాలని, కొంత మొత్తమైనా శాలరీలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారట.

SBI led banks: Jet employees now perceive themselves as bank employees demanding release of salary

కాగా, జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు చెందిన నేషనల్ ఏవియేటర్ గిల్డ్ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇంతకుముందు ఓ విజ్ఞప్తి చేసింది. ఎస్బీఐ ద్వారా కనీసం తమ ఒక వేతనం అయినా ఇప్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు వారు ప్రధానికి ఈ మెయిల్ చేశారు.

English summary

SBI నుంచి కనీసం ఒక నెల శాలరీ ఇప్పించండి: జెట్ ఉద్యోగుల వేడుకోలు | SBI led banks: Jet employees now perceive themselves as bank employees demanding release of salary

Jet Airways, whose wings have been flailing for a long time, is now a quasi-nationalised entity with banks led by State Bank of India (SBI) getting to control 50.5 percent of its equity.
Story first published: Monday, April 29, 2019, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X