ఫేస్‌బుక్ చైర్మన్ అండ్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన భార్యకు స్లీప్ బాక్స్ తయారు చేశాడు. తన సతీమణి పిల్లలతో తీరిక లేకుండా గడుపుతోందని, వారిని ఆడించడం, తినిపించడం, రాత్రిపూట పిల్లల కారణంగా సరిగా నిద్రకూడా పోవడం లేదని, నిరంతరం పిల్లలతో పని కారణంగా రాత్రివేళల్లో ఆమె సరిగా నిద్రపోవడం లేదని, అందుకే ఆమె కోసం స్లీప్ బాక్స్ తయారు చేశానని చెబుతున్నాడు.
ఈ స్లీప్ బాక్స్ కారణంగా ఆమె హాయిగా నిద్రపోతుందని చెప్పాడు. ఇందుకు సంబంధించి స్లీప్ బాక్స్ ఫోటోను కూడా ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నాడు. తల్లిగా ఉండటం ఎంతో కష్టమైన పని అని, తమ పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్రిసిల్లా రాత్రుల్లు సరిగ్గా నిద్రపోవడం లేదని, పిల్లలు లేచే సమయం అయిందోమేనని రాత్రివేళల్లో తన ఫోన్ చూసుకుంటోందని, అలా లేచి నిద్రపోలేక ఒత్తిడికి గురవుతోందని, అందుకోసమే ఆమె కోసం ఇది తయారు చేశానని జుకర్ బర్గ్ చెప్పాడు.

ఈ బాక్స్ ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సన్నని కాంతితో వెలుగుతుందని, ఈ లైట్‌ను ఆమె చూస్తే పిల్లలు లేచే సమయం అయ్యిందని తెలిసిపోతుందని, ఈ బాక్స్ సమయాన్ని చూపించదని, ఒకవేళ ఆమె మధ్యరాత్రి లేచినప్పుడు బాక్స్‌ను చూసి ఆమె తిరిగి హాయిగా నిద్రపోవచ్చునని, సమయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, కాబట్టి ఆమెపై ఒత్తిడి ఉండదని, నేను అనుకున్న దానికంటే ఈ బాక్స్ బాగా పని చేస్తోందని చెప్పాడు. ఓ ఇంజినీర్‌గా భార్యకు ఉపయోగపడే పరికరం తయారు చేశానని చెప్పాడు. ఇలాంటి బాక్సులు కావాలని ఫ్రెండ్స్ అడుగుతున్నారని, ఆసక్తికర వ్యాపారులు ఎవరైనా దీనిని తయారు చేయవచ్చునని చెప్పాడు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications