ఐఎల్ & ఎఫ్ఎస్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) ఆడిట్ విషయంలో ప్రముఖ గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ (డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్) పైన నిషేధం కత్తి వేలాడుతోంది. సెక్షన్ 140(5) కింద కార్యకలాపాలకు అయిదేళ్ల పాటు బ్యాన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఈ సెక్షన్ కింద ప్రైస్ వాటర్ హౌస్ పైన సెబి వేటు వేసింది. సత్యం స్కాం కేసులో ఇది ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కారణంగా రెండేళ్ల పాటు ఈ కంపెనీని లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ చేయకుండా నిషేధించారు. ప్రైస్ వాటర్ హౌస్‌కు చెందిన భాగస్వామ్య సంస్థలపై కూడా మూడేళ్ల పాటు నిషేధం విధించింది. విచారణ జరుగుతోందని, తాము సహకరిస్తున్నామని, తమ ఆడిట్‌లు అన్ని నియమ నిబంధనల ప్రకారమే ఉన్నాయని డెలాయిట్ ప్రతినిధి ఒకరు అన్నారు.

IL&FS సంక్షోభం
IL&FS సంక్షోభం ఇటీవల కదిపేసింది. ఈ నేపథ్యంలో దీని ఆడిటర్‌గా ఉన్న డెలాయిట్ పైన కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ కింద నిషేధం విధించాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మోసపూరిత కార్యకలాపాలతోప్రమేయం ఉన్న ఆడిటర్లపై చర్యలకు ఈ సెక్షన్ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి అవకాశం ఇస్తుంది. డెలాయిట్ కనుక నిషేధానికి గురైతే ఇది రెండో అతిపెద్ద కంపెనీ అవుతుంది. అంతకుముందు, సత్యం స్కాం కేసులో ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ పైన సెబి నిషేధం విధించింది. అప్పుడు ఈ కంపెనీ రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవడంతో పాటు అక్రమంగా ఆర్జించిన 130.9 మిలియన్లకు పై మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. పలు కార్పోరేట్ సంస్థల అంచనాలు పెంచడంలో ఆడిటర్లది కీలక పాత్ర. ఆయా సంస్థల ఆర్థిక ఫలితాలను ఎక్కువగా చూపించి, అంచనాలు పెంచుతారు. దీంతో చివరకు మదుపరులు, ఉద్యోగులు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్‌లో ఇదే జరిగింది. సత్యం స్కాం వెలుగుచూసిన ఎనిమిదేళ్ల తర్వాత, 2018 జనవరిలో సెబి ప్రైస్ వేర్ హౌస్ పైన చర్యలు తీసుకుంది.

అందుకే డెలాయిట్‌పై ఆరోపణలు
IL&FS రుణ సంక్షోభంలోను ఆడిటర్లపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ ఆడిటర్ అయిన డెలాయిట్ పనితీరుపై ఆరోపణలు వచ్చాయి. డెలాయిట్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. దర్యాప్తు జరుగుతోందని, అధికారులకు అన్నివిధాలా సహకరిస్తున్నామని, నియమ, నిబంధనలను పాటించే ఆడిటింగ్ చేశామని డెలాయిట్ అధికార ప్రతినిధి ఒకరు ఓ ఇంగ్లీష్ పత్రికతో చెప్పారు.

ఆత్మరక్షణలో డెలాయిట్
IL&FS గ్రూప్ సంస్థలకు తాము మాత్రమే ఆడిట్ చేయలేదని, పలు చిన్న సంస్థలు కూడా చేశాయని డెలాయిట్ అంటోంది. మే 2018 నుంచే IL&FS చెల్లింపుల వైఫల్యం ప్రారంభమైందని డెలాయిట్ అంటోంది. IL&FS లోని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, ఐటీఎన్ఎల్, ఏఎఫ్ఐఎన్ సంస్థల ఆడిట్‌లను ఇతర సంస్థలు చేశాయని చెబుతోంది. IL&FS గ్రూపులోని 347 అనుబంధ సంస్థల ఆడిటింగ్‌తో తమకు సంబంధం లేదని తెలిపింది. ఇవి చాలావరకు విదేశాల్లో ఉన్నాయని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications