ఇది ఇంటర్నెట్ యుగం. ఇక్కడ మనకు దొరకనిది లేదు. ఈ ఇంటర్నెట్ పైన పట్టు సాధించేందుకు బిజినెస్ టైకూన్లు ఉత్సాహంగా ఉన్నారు. వైర్లు, టవర్లు వెళ్లలేని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ తీసుకు వెళ్లాలనేది అమెజాన్, స్పేస్ ఎక్స్ కంపెనీల లక్ష్యం. ఇందుకోసం సరికొత్త ఆలోచన చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ ఇదివరకే ఉపగ్రహాల ద్వారా దీనిని సాధ్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ తర్వాత అమెజాన్ కూడా అదే బాట పట్టింది. తద్వారా ఇంటర్నెట్ పైన పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తోంది.

అమెజాన్ కూపర్ ప్రాజెక్టు
ఇందుకోసం అమెజాన్ కూపర్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా భూమి మొత్తాన్ని కవర్ చేసేలా 3,236 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. వీటిని తక్కువ ఎత్తులో గల కక్షలోకి (లో ఎర్త్ ఆర్బిట్) ప్రవేశింప చేస్తారు. దీంతో కొండలు, కోనలు, అడవులు అని లేకుండా, తీగలు, టవర్లతో సాధ్యం కాని ప్రాంతాలకు శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ విస్తరించాలని నిర్ణయించింది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు బ్లూ ఆరిజిన్ అనే పేరుతో రాకెట్ల తయారీ కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ స్పేస్ టూరిజం, ఉపగ్రహ ప్రయోగాల కోసం రాకెట్లను తయారు చేయనుంది. 2021 నాటికి తొలి రాకెట్‌ను ప్రయోగించే ఆలోచనలో ఉంది.

11,943 ఉపగ్రహాలు ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్
ఆమెజాన్ కంపెనీ కంటే ముందే స్పెస్ ఎక్స్ కూడా ఇంటర్నెట్‌పై పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది. స్పేస్ ఎక్స్ ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థ. తక్కువ ఎత్తులో గల కక్షలోకి 11,943 ఉపగ్రహాలను ప్రయోగించాలని, తద్వారా భూమిని మొత్తం కవర్ చేయాలని స్పేస్ ఎక్స్ నిర్ణయించింది. వచ్చే ఏడాది లేదా 2021లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావొచ్చు. అయితే, స్పేస్ ఎక్స్ కంటే అమెజాన్‌కు ఓ ప్లస్ ఉంది. అమెజాన్ కంటే దీనికి నిధుల కొరత అధికం. పైగా అమెజాన్ ప్రపంచంలోనే అత్యధికంగా నగదు నిల్వలు కలిగిన సంస్థల్లో ముందుంది. పైగా ఈ ప్రాజెక్టును బలమైన వ్యాపార భాగస్వాములతో పంచుకోవాలని చూస్తోంది. అమెజాన్, స్పేస్ ఎక్స్‌తో పాటు మరిన్ని సంస్థలు కూడా ఉపగ్రహాలతో ఇంటర్నెట్ ప్రయోగానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

తక్కువ ఎత్తులో ఉపగ్రహాలు
అమెజాన్ 367 మైళ్ల వద్ద 784 ఉపగ్రహాలు, 379 మైళ్ల వద్ద 1,296 ఉపగ్రహాలను, 391 మైళ్ల వద్ద 1,156 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. స్పేస్ ఎక్స్ మొత్తం 11,943 ఉపగ్రహాలు ప్రయోగించనుంది. ప్రతి ఉపగ్రహం బరువు 386 కిలోలు. అంటే ఒక్కో ఉపగ్రహం బరువు దాదాపు ఓ చిన్నపాటి కారు బరువు ఉండనుంది. 4,425 సాటిలైట్లు దాదాపు 1110 కిలో మీటర్ల ఎత్తులో, 7,518 శాటిలైట్లు 322 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయనుంది. ఇలా వరుస ప్రాజెక్టులతో లోఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లతో స్పేస్ కిక్కిరిసిపోనుంది. దీనికి తోడు ఇన్ని ఉపగ్రహాలను ప్రయోగిస్తే అంతరిక్షంలో పేరుకుపోయే వ్యర్థాల సంఖ్య కూడా పెరగనుంది. ఇప్పటికే 17 కోట్ల వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. వీటిల్లో 10 సె.మీ కంటే ఎక్కువ ఉన్నవి 20 వేలకు పైగా ఉన్నాయి. 5-1 సె.మీ. మధ్యలోనివి దాదాపు 5లక్షలు ఉన్నాయి. సె.మీ. కంటే తక్కువ ఉన్నవి దాదాపు కోటికి పైగా ఉన్నాయి. ఇవి అత్యంత వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఇవి ఢీకొంటే కక్ష్యలోని ఉపగ్రహాలు దెబ్బతింటాయి.

భూమి అంతటికీ ఇంటర్నెట్
టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్స్ ప్రారంభం కోసం 1854లో మొదటిసారి న్యూఫౌండ్‌లాండ్ - ఐర్లాండ్ మధ్య సబ్‌మెరైన్ కేబుల్స్ వేశారు. ఇప్పుడు మనం అడ్వాన్స్‌డ్ ఫైబర్ ఆఫ్టిక్ కేబుల్స్ ద్వారా కనెక్ట్ అవుతున్నాం. కానీ ఈ కేబుల్స్ అంత సురక్షితమేమీ కావు. ఈ నేపథ్యంలో అమెజాన్, స్పేస్ ఎక్స్ వంటి పలు కంపెనీలు ఆకాశం వైపు చూస్తున్నాయి. అదే కక్షలోకి ఉపగ్రహాలను పంపించి ఇంటర్నెట్ అనుసంధానం చేయడం. ఇప్పటికే మీరు ఫేస్‌బుక్ సోలార్ పవర్ ఇంటర్నెట్ డ్రోన్లు, గూగుల్ హై-అల్టిట్యూడ్ (ఎత్తులో ఉండే) డేటా బీమింగ్ బెలూన్ల గురించి విన్నాం. అమెజాన్, వన్‌వెబ్, స్పేస్ ఎక్స్ మరింత ముందుకెళ్లి స్పేస్‌లో ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెజాన్.. కూపర్ ప్రాజెక్టు ద్వారా, స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ ప్రాజెక్టు ద్వారా భూమి అంతటికీ ఇంటర్నెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications