దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీల తయారుదారీ సంస్థ మారుతీ సుజుకీ లాభాలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్పాదక వ్యయాలకు కళ్లెం వేయడంతో పాటు ఉత్పాదకతను కూడా పెంచి లాభాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. తాము వ్యయాలను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రతి కంపెనీలాగే తాము కూడా లాభాలను పెంచుకుంటామని, ఇందులో భాగంగా స్థానికీకరణ చాలా ముఖ్యమని, ఇఫ్పుడు ఇదే కీలకమని మారుతీ సుజుకీ సీఎఫ్ఓ అజయ్ సేథీ తెలిపారు.
ఒకప్పుడు విదేశీ భాగాలపై ఆధారపడే వాళ్లమని, ఇప్పుడు దేశీయంగానే వాటిని తయారు చేయాలని చూస్తున్నామని, ఇక్కడి నుంచి తాము ఫలితాలు సాధించడానికి కష్టపడాలన్నారు. దీనికోసం ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలు చేపట్టామన్నారు.

డీజిల్ ఇంజిన్ ప్లాంట్లను మార్చుకునే విషయంపై కూడా సేథీ స్పందించారు. మరికొన్నేళ్లలో మారుతీ డీజిల్ వాహనాలకు స్వస్తీ చెప్పనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. 99 శాతం డీజిల్ ఇంజిన్ కర్మాగాలను పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ల తయారీ కేంద్రాలుగా మారుస్తామని, అందులో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications