జాన్సన్ బేబీ షాంపూ అమ్మకాలను నిలిపివేయాలని బాలల హక్కుల సంస్థ రాష్ట్రాలకు సూచించింది. ప్రయోగ పరీక్షలో ప్రమాణాలు పాటించలేదని తేలినందునే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) జాన్సన్ బేబీ షాంపూ విక్రయాల్ని ఆపేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దుకాణాల నుంచి వాటి నిల్వలను తొలగించాలని చీఫ్ సెక్రటరీలకు లేఖ రాసింది.
షాంపూ నమూనాల్ని ల్యాబ్‌లో పరీక్షించగా, ప్రామాణిక నాణ్యత లేదని తేలిందని పేర్కొంది. జైపూర్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ధ్రువీకరించిందని ఎన్సీపీసీఆర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుంచి జాన్సన్ బేబీ షాంపూ, టాల్కమ్ పౌడర్ నమూనాలను సేకరించామని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ (దక్షిణాది), జార్ఖండ్ (ఈస్ట్), రాజస్థాన్ (వెస్ట్), మధ్యప్రదేశ్ (సెంట్రల్), అసోం (నార్త్ ఈస్ట్) నుంచి నమూనాలను సేకరించామని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ ల్యాబ్ టెస్ట్‌లో షాంపూ నాణ్యత లోపాలు వెలుగు చూశాయని పేర్కొంది. మిగతా రాష్ట్రాలలోని ల్యాబ్‌ల నుంచి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉందని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని తెలిపింది.
టాల్కమ్ పౌడర్ పరీక్షలకు సంబంధించిన వివరాలు కూడా త్వరగా ఇవ్వాలని రాజస్థాన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్‌ను అడిగినట్లు ఎన్సీపీసీఆర్ తెలిపింది. కాగా, క్యాన్సర్ కారకాలు, ఇతరత్రా హానికర అవశేషాలున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ పరీక్షలను నిర్వహించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications