బెంగళూరులో నివసించే వారు కాల్ డ్రాప్స్, ఇంటర్నెట్ సేవల అంతరాయం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కారణం ఉంది. స్థానిక మున్సిపల్ బాడీ, టెలికం ప్లేయర్స్ ఇద్దరి మధ్య పేమెంట్ ఇష్యూస్ వచ్చాయి. బయట ఉన్న టెలికం కేబుల్స్ తగ్గించాలని బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, వాటిని అండర్ గ్రౌండ్‌లోకి మార్చేందుకు కంపెనీల నుంచి ఫీజు అడిగింది.
అయితే, టెలికం ప్రొవైడర్ల వాదన మరోలా ఉంది. రోడ్డు కన్‌స్ట్రక్షన్ వర్క్ కారణంగా ఆ వైర్లు గ్రౌండ్ పైకి వచ్చాయని, వాటికి ఇదివరకే ఫీజు చెల్లించామని చెబుతున్నాయి. బీబీఎంపీ మాత్రం.. అసలు ఆ కేబుల్స్ అనధికారికంగా ఉన్నందువల్లే కట్ చేశామని చెప్పడం గమనార్హం.

అనధికార కేబుల్స్ కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నామని, కేబుల్స్‌ను రెగ్యులరైజ్ చేసుకోవాలని తాము పలుమార్లు టెలికం కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశామని, నియమ నిబంధనలు పాటించాలని చెప్పామని, కానీ వారు (టెలికం కంపెనీలు) తమ హెచ్చరికలను లెక్క చేయలేదని, దీంతో తాము వాటిని కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమకు అంతకుమించిన ఆప్షన్ లేదని ఓ అధికారి అన్నారు.
టెలికం కంపెనీలకు ఇప్పటికి కూడా అవకాశముందని, వారు తగిన రుసుము చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. చాలా కేబుల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. ఇవి ప్రమాదాలకు కారణం అయ్యాయని చెప్పారు.
కేబుల్స్ అలా బయట వేసేందుకు తమకు తాత్కాలికంగా అనుమతి ఉందని, నిత్యం రోడ్డు కన్‌స్ట్రక్షన్ వర్క్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అండర్ గ్రౌండ్ కోసం తాము ఇప్పటికే ఫీజు కూడా చెల్లించామని టెలికం ఇండస్ట్రీ బాడీ చెబుతోంది. తాము ఇదివరకే ఫీజు చెల్లించినా బీబీఎంపీ మళ్లీ అడుగుతోందన్నారు. అలాగే కేబుల్స్‌ను అండర్ గ్రౌండ్ చేసేందుకు తాము సమయం కోరామని చెప్పారు. ఈ అంశంపై సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) టెలికం సెక్రటరీని కలిశారు.
ఇప్పటికే టెలికం సెక్రటరీని కలిశామని, ఆయన చొరవతో తాము కర్ణాటక స్టేట్ చీఫ్ సెక్రటరీని కలిశామని, వారిని కలిసిన వారిలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర టెలికం కంపెనీల ప్రతినిధులు ఉన్నారని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని బీబీఎంపీని చీఫ్ సెక్రటరీ ఆదేశించినట్లు చెబుతున్నారు. మంగళవారం బీబీఎంపీ కమిషనర్‌తో భేటీ అయి సమస్యను పరిష్కరించుకునే అవకాశముంది.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications