క్రూడ్ కాస్త కూల్ అవడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కొద్దిగా ప్రోత్సాహక సంకేతాలు, లోయర్ లెవెల్స్ దగ్గర బయింగ్, మళ్లీ బ్యాంకుల్లో జోరు.. ఇవన్నీ కలిసి మార్కెట్లను మళ్లీ పరుగులు తీయించాయి. నిఫ్టీ మళ్లీ 11750 పాయింట్ల మార్కు పైన ముగిసింది. ఉదయం నుంచి మిడ్ సెషన్ వరకూ నిస్తేజంగా సాగిన మార్కెట్లు ఆఖర్లో మాత్రం పైపైకి దుమికాయి. చివరకు సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 39067 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 113 పాయింట్లు పెరిగి 11754 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 450 పాయింట్లు పెరిగి 30,013 వద్ద క్లోజైంది.
మళ్లీ బ్యాంక్స్ బాజా
బ్యాంక్ నిఫ్టీ మళ్లీ ఎగిరి గంతేసింది. ఇండెక్స్ ఏకంగా 1.5 శాతానికి పైగా పెరిగింది. ఆఖరి గంటలో పటిష్టమైన కొనుగోళ్ల మద్దతు మార్కెట్లను కూడా పైకి తీసుకెళ్లింది. ఐసిఐసిఐ బ్యాంక్ 3 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.3 శాతం, ఎస్బీఐ 1.9 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1.75 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్‌లో ఒక్క ఐడీఎఫ్‌సి ఫస్ట్ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లోనే ముగియడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.

ఉక్కులాంటి ఫలితాలు
టాటా స్టీల్ పటిష్టమైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. దీంతో ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులోనే 7 శాతానిపైగా లాభాలను మూటగట్టుకుంది. చివరకు 7.01 శాతం పెరిగి రూ.546.55 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో జెఎస్‌డబ్ల్యు స్టీల్ 2.6 శాతం, జిందాల్ హిసార్ సుమారు 2 శాతం పెరిగింది.
అరబిందో ఫార్మా
హైదారాబాద్‌కు చెందిన ఈ ఫార్మా సంస్థ స్టాక్ 30 నెలల గరిష్ట స్థాయికి చేరింది. మార్చి క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా రావడంతో స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు రూ.830 దగ్గర క్లోజైంది.
హిందాల్కో గెయిన్స్స్
తెలంగాణలోని కొల్లూరులో నష్టాలతో నడుస్తున్న అల్యూమినియం ఫాయిల్ మేకింగ్ యూనిట్‌ను హిందాల్కో సంస్థ ముంద్రా అల్యూఫాయిల్‌కు స్లంప్ పద్దతిలో విక్రయించింది. దీంతో హిందాల్కో 2 శాతానికి పైగా లాభపడింది. చివరకు స్టాక్ రూ.201 దగ్గర ముగిసింది.
3ఎం.. తత్తరపాటు
త్రీ ఎం ఇండియాకు చెందిన పేరెంట్ సంస్థ త్రీ ఎం తన వార్షిక లాభాల అంచనాను కుదించింది. ఉన్న ఐదు బిజినెస్ యూనిట్లలో నిర్వాహణా లాభాలు నీరసించాయి. అంతే కాదు 2000 మంది ఉద్యోగులను కూడా తీసివేయబోతున్నట్టు వెల్లడించింది. దీంతో ఈ సంస్థ స్టాక్ కూడా ఒకే రోజు భారీగా పడింది. ట్రేడింగ్ వాల్యూమ్స్ నాలుగు రెట్లు పెరిగాయి. చివరకు స్టాక్ రూ.23477 దగ్గర క్లోజైంది.
పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ పండింది
నిరుటితో పోలిస్తే పిరమల్ సంస్థ ఆదాయం 23 శాతం, నికర లాభం 25 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఏడాది పరంగా చూస్తే... ఆదాయం 24 శాతం, నికర లాభం 25 శాతం పెరిగింది. అయినప్పటికీ స్టాక్ మాత్రం ఈ రోజు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరకు ఈ స్టాక్ 6 శాతం పతనమై రూ.2404 దగ్గర క్లోజైంది.
వచ్చే వారం 2 సెలవులు
సోమవారం (29వ తేదీ) ముంబై - మహారాష్ట్రలో ఎన్నికల నేపధ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. మళ్లీ బుధవారం(మే 1వ తేదీ) మహారాష్ట్ర దివస్ సందర్భంగా కూడా సెలవు దినం. వరుస సెలవులు ఉన్న నేపధ్యంలో ట్రేడింగ్ యాక్టివిటీ కూడా తక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..



Click it and Unblock the Notifications