అమెరికా చమురు ఆంక్షలు: ఇరాన్‌కు మలేషియా సహకారం
మే 2వ తేదీ నుంచి ఇరాన్ చమురు ఎగుమతులు సున్నా కావాలని, భారత్, చైనా, టర్కీ సహా ఏ దేశాలు దీనిని కొనుగోలు చేయవద్దని అమెరికా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత్, చైనాలు తర్జన భర్జన పడుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పెద్దన్న టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇరాన్ మాత్రం తన ఆయిల్‌ను మరో మార్గంలో సేల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రహించాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తమ ఆయిల్ ఉత్పత్తులను మలేషియా సాయంతో అమ్మే ప్రయత్నాలు చేస్తోందని, ఇందుకు మలేషియా కూడా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు మేజర్ సోర్స్ ఆయిల్. ఇరాన్ చమురు ఉత్పత్తుల దిగుమతులకు భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అమెరికా మే 2వ తేదీ వరకు సమయం ఇచ్చింది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ గడువు విధించింది. మరో వారం రోజుల్లో ఈ గడువు పూర్తి కానుంది.

ఇరాన్ చమురు దిగుమతుల్లో చైనా, భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగతా ఆరు దేశాలు కూడా ఇరాన్ నుంచి ఎక్కువ చమురునే కొనుగోలు చేస్తాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాలా దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించాయి. డైలమాలో ఉన్నాయి. కొన్ని పూర్తిగా ఆపేశాయి.
ఈ నేపథ్యంలో మలేషియా.. ఇరాన్‌కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అమెరికా ఆంక్షలు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను బలంగా మారుస్తున్నాయట. రెండు దేశాల మధ్య ఆయిల్ ట్యాంకర్స్ ప్రయాణాలు కూడా కొనసాగుతున్నాయట. మలేషియా బ్యాంకుల ద్వారా ఆయిల్, నేచరల్ గ్యాస్ సేల్ చేసేందుకు ఇరాన్ సిద్ధమైందట.
మలేషియా ప్రభుత్వరంగ పెట్రోనాస్ సహకారంతో విక్రయించనున్నారని తెలుస్తోంది. 2017లో ఈ కంపెనీ ఇరాన్‌తో పరస్పర సహకార ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 2018లో పెట్రోనాస్ అధికారులు ఇరాన్ వెళ్లారు. రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. మలేషియా సహకారంతో ఇరాన్ బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications