For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు పడిపోవడంతో పెరిగిన డిమాండ్

|

ఇటీవల బంగారం ధరలు తగ్గాయి. దీంతో కొనుగోళ్లు పెరిగాయి. తిరిగి బంగారంకు డిమాండ్ రావడంతో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మందగించాయి. బంగారం ధర పెరుగుదలకు ఇది కూడా కారణమని చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ల దృష్ట్యా ఆయా దేశాలు ద్రవ్య సడలింపు చర్యలు చేపట్టవచ్చునని భావిస్తున్నారని, బంగారం పెరుగుదలకు ఇది కారణమని చెబుతున్నారు. కొంతమంది ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ కంటే సురక్షిత పెట్టుబడులు కోరుకుంటున్నారని చెప్పారు.

దేశీయ మార్కెట్లో బంగారం ధర గురువారం పది గ్రాములకు రూ.150 పెరిగింది. జ్యువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. గత రెండు మూడు రోజుల్లో ఎంత ధర తగ్గిందో, గురువారం ఒక్క రోజే దాదాపు అంత పెరిగింది. ఈ వారానికి ముందు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్సుకు 1,265.90 డాలర్లుగా ఉంది. గురువారం స్పాట్ గోల్డ్ ఒక ఔన్సుకు 1,278.62కు చేరుకుంది.

బంగారం ధరలు పడిపోవడంతో పెరిగిన డిమాండ్

ఈ వారం ప్రారంభంలో బంగారం ధరలు బాగా పడిపోయాయి. ఒక ఔన్స్ ధర 1,265.90 డాలర్లుగా ఉంది. దీంతో బంగారం ధరకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు 0.3 శాతం పెరిగాయి. ప్లాటినం ధరలు 0.8 శాతం పెరిగాయి. పల్లాడియం ధర 0.2 శాతం తగ్గింది.

Read more about: gold బంగారం
English summary

Gold buying picks up after prices fall to lowest level of this year

Gold prices climbed today, as signs of weak global growth rekindled investor interest in the safe-haven metal, keeping it on track for its first weekly gain in five, while a strong dollar ahead of the US GDP data capped gains for the bullion.
Story first published: Friday, April 26, 2019, 15:50 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more