లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి ఇండియా భారతదేశంలో తొమ్మిదవ షోరూమ్‌ను నేడు (ఏప్రిల్ 26) హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెం.12లో నూతనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి సినిమా నటులు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్ రిబ్బన్ కట్ చేసి విలాసవంతమైన డుకాటి ఇండియా షోరూమ్‌ను ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అక్కినేని నాగచైతన్య నాలుగు నూతన స్క్రాంబ్లర్ మోడల్స్‌ను (స్క్రాంబ్లర్ ఐకాన్, డెసర్ట్ స్లెడ్, ఫుల్ థ్రోటెల్, కేఫ్ రేసర్) ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్జీ కనోవాస్ మాట్లాడారు. ''ఈ స్క్రాంబ్లర్ శ్రేణిని దేశంలో ఎక్కువమంది అభిమానిస్తారు. ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఈ డుకాటి ఫ్యామిలీ స్క్రాంబ్లర్ యాక్సెసబుల్ శక్తి, అత్యున్నత నియంత్రణను కలిగి ఉంటుంది. ఏ తరహా రోడ్లపై అయినా దీనిపై ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మేం మొత్తం శ్రేణిని అత్యాధునికంగా తీర్చిదిద్దాం. ఈ నూతన లైనప్ స్వేచ్ఛాయుత ధోరణితో సాంస్కృతిక ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుంది. డుకాటి స్క్రాంబ్లర్ కేవలం బైక్ మాత్రమే కాదు.. ఇది పూర్తి సరికొత్త జీవనశైలి. పూర్తిగా అంకితం చేయబడిన అప్పెరల్ మరియు యాక్సెసరీలు దీనిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో మా మొట్టమొదటి ఉత్పత్తి ఆవిష్కరణ ఇది. భారతదేశంలో మా నూతన స్క్రాంబ్లర్ శ్రేణి పరిచయం చేయడం పట్ల ఆనందంగా ఉన్నాం'' అని పేర్కొన్నారు.

ఎస్ అండ్ ఎస్ ఆటోనేషన్, డీలర్ ప్రిన్సిపల్ కోటి పరుచూరి మాట్లాడుతూ... ''మా షోరూమ్‌ను ప్రారంభించిన విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్యగారికి కృతజ్ఞతలు. డుకాటి నాకు చిన్నప్పటి నుండి ఒక యాస్పిరేషనల్ బ్రాండ్‌గా ఉండేది. అన్ని విభాగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న డుకాటి ఇండియాలో తొమ్మిదో షోరూమ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడానికి సహకరించిన డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సెర్జీ కనోవాస్‌గారికి ధన్యవాదాలు. ఈ సుప్రసిద్ధ సిరీస్ మరింత సమకాలీనంగా, మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండటంతో పాటుగా మరింత స్వేచ్ఛాయుత వినోద ప్రపంచానికి తోడ్కొని పోతుంది. ఈ అత్యాధునిక 'జాయ్‌వోల్యూషన్' మోటార్ సైకిల్ యొక్క సంపూర్ణ సారాంశం కలిగి ఉండి, దీని ద్విచక్రాలు, పెద్ద హ్యాండిల్ బార్, సరళమైనప్పటికీ శక్తివంతమైన ఇంజిన్ మరియు పూర్తి వినోదాన్ని అందిస్తుంది'' అన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications