టెలికం రంగంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో దూసుకెళ్తోంది. సబ్‌స్క్రైబర్స్ జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌ను దాటేసి, రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. రిలయన్స్ జియోకు 30.6 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, ఎయిర్‌టెల్‍కు 28.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. జియో కంటే ముందు వొడాఫోన్ - ఐడియా తొలి స్థానంలో ఉంది. దీనికి 38.7 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఈ లెక్క డిసెంబర్ 2018 నాటికి.
ఇంతకుముందు వరకు వొడాఫోన్ - ఐడియా తొలి స్థానంలో, ఎయిర్‌టెల్ రెండో స్థానంలో ఉండగా, అత్యుత్తమ ప్యాకేజీతో ఇటీవలే దూసుకొచ్చిన జియో ఎయిర్‌టెల్‌ను మూడో స్థానానికి పడేసింది. కాగా, రిలయన్స్ జియో త్వరలో వొడాఫోన్-ఐడియాను కూడా దాటేసి అగ్రస్థానానికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. వచ్చే మూడు నుంచి నాలుగు త్రైమాసికాల్లో జియో.. వొడాఫోన్ ఐడియాను వెనక్కు నెట్టేయవచ్చని భావిస్తున్నారు.

భారతీ ఎయిర్‌టెల్ ఇండియన్ టెలికం రంగాన్ని దాదాపు రెండు దశాబ్దాల పాటు శాసించింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ అనూహ్యంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. వొడాఫోన్-ఐడియా విలీనంతో ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు జియో కారణంగా మూడో స్థానానికి పడిపోయింది.
రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో లాంచ్ చేశారు. మొబైల్ డాటా, కాల్ డాటాలో ఇది మిగతా టెలికం ప్రొవైడర్లకు సవాల్‌గా నిలిచింది. దీంతో ఎక్కువమంది కస్టమర్లు జియో వైపు ఆకర్షితులవుతున్నారు.
సరికొత్త టారిఫ్ ప్లాన్స్‌తో జియో కస్టమర్లను ఆకట్టుకుంటోందని ఫిన్ఎక్స్‌ప్రో కన్సల్టెన్సీ కంపెనీ సీఈవో మోహన్ శుక్లా తెలిపారు. జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం 2019 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో జియోకు 2.7 కోట్ల మంది కొత్త యూజర్లు వచ్చారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications