3 రోజుల నష్టాలకు బ్రేక్! 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ

గురువారం ఎఫ్ అండ్ ఓ ఎక్స్‌పైరీ ఉన్నప్పటికీ మార్కెట్లు మాత్రం వరుస నష్టాలకు బ్రేక్ వేసి పైపైకి దూసుకెళ్లాయి. రూపాయి బలహీనపడినప్పటికీ సూచీలు మాత్రం ఆ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. ఆఖరి గంటలో వచ్చిన అనూహ్యమైన కొనుగోళ్ల మద్దతుతో నిఫ్టీ 11700 పాయింట్ల మార్కుపైన పటిష్టంగా ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 30 వేల పాయింట్ల చేరువకు వెళ్లింది. అల్ట్రాటెక్ సిమెంట్ మెరుగైన ఫలితాలు మార్కెట్ మూడ్‌ను కొద్దిగా లిఫ్ట్ చేశాయి. దీనికి బ్యాంక్స్ నుంచి లభించిన మద్దతు కూడా తోడైంది. చివరకు 150 పాయింట్లు పెరిగి 11,726 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 39054 దగ్గర క్లోజైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 381 పాయింట్లు దూసకెళ్లి 29860 దగ్గర ఆగింది.

అల్ట్రాటెక్ సిమెంట్, బిపిసిఎల్, హెచ్ సి ఎల్ టెక్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, సిప్లా, పవర్ గ్రిడ్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.

Sensex spurts over 490 points, Nifty ends at 11,700

అల్ట్రాటెక్ మంచి ఫలితాలు

అల్ట్రాటెక్ సిమెంట్స్ మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఆదాయంలో ఏకంగా 18 శాతం వృద్ధి నమోదైంది. ఎబిటా 21 శాతం పెరిగి రూ.2213 కోట్లకు చేరింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏకంగా రెట్టింపై రూ.1017 కోట్లుగా నమోదైంది. సంస్థ రూ.11.50 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో స్టాక్ 4.7 శాతం పెరిగి రూ. 4395 దగ్గర క్లోజైంది.

ఇదే రంగానికి చెందిన ఏసీసీ మెరుగైన రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ మార్జిన్లు, రా మెటీరియల్ ఖర్చులు అధికం కావడంతో స్టాక్ నీరసించింది. సుమారు 6 నెలల కనిష్టానికి చేరింది. చివరకు 3.6 శాతం నష్టంతో రూ.1607 దగ్గర క్లోజైంది.

టాటా మోటార్స్ మళ్లీ పాత రూట్

కాస్త కోలుకుంటోంది అనుకుంటున్న టాటా మోటార్స్ మళ్లీ పాత రూట్‌లోనే వెళ్తోంది. ప్రధానమైన కారణాలేవీ ఈ రోజు పతనానికి తెలియకపోయినప్పటికీ వారం రోజుల్లో వెలువడబోయే సేల్స్ నెంబర్స్ నిరుత్సాహంగాఉండొచ్చనే అంచనాలతో స్టాక్ బలహీనపడింది. ఒక దశలో 6 శాతం వరకూ పడిపోయిన స్టాక్ చివరకు 3.5 శాతం నష్టాలతో రూ.224 దగ్గర క్లోజైంది. ఇదే ఫీల్డ్‌లో ఉన్న మారుతి సుజుకి కూడా ఇంట్రాడేలో రూ.6910 స్థాయికి పడిపోయింది. చివరకు రూ. 7016 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

టాటా ఎలక్సి రిజల్ట్స్ నీరసం

ప్రముఖ ఐటీ సంస్థ టాటా ఎలిక్సి నిరుత్సాహకర క్యూ4 ఫలితాలను వెల్లడించింది. ఆదాయం 0.5 శాతం క్షీణించి రూ.405 కోట్లకు పరిమితమైంది. ఎబిటా 5.8 శాతం, మార్జిన్లు 1.30 శాతం పతనమయ్యాయి. అయితే నికరలాభం మాత్రం 8 శాతం పెరిగింది. కానీ స్టాక్ 2.06 శాతం పతనమై రూ.930 దగ్గర క్లోజైంది.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల జోరు

క్రూడ్ ధరలు కొండెక్కడంతో గత మూడు రోజుల నుంచి భారీగా పతనమవుతూ వచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఈ రోజు కొద్దిగా తేరుకున్నాయి. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం 5 శాతానికి పైగా పెరిగితే... ఇండియన్ ఆయిల్ కార్పొర్పోరేన్ 3.5 శాతం వరకూ పెరిగింది.

స్టెరిలైట్.. శాడ్ స్టోరీ

టెలికాం కేబుల్స్, ఫైబర్ కేబుల్స్ తయారీలో పటిష్టమైన స్థానంలో ఉన్న స్టెరిలైట్ టెక్నాలజీస్ స్టాక్ గత కొద్దికాలం నుంచి బలహీనపడ్తోంది. ఈ రోజు సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ స్టాక్ మాత్రం బలహీన పడింది. ఆదాయంలో 112 శాతం, నికర లాభంలో 47 శాతం, ఎబిటాలో 43 శాతం వృద్ధి కలిసొచ్చింది. అయితే మార్జిన్లు గణనీయంగా పడిపోవడం, రూ.400 కోట్ల కేస్‌కు సంబంధించి ట్రైబ్యునల్‌లో పెండింగ్ తీర్పు వంటివి స్టాక్‌ను నీరసపర్చాయి. చివరకు స్టాక్ 7 శాతం పతనమై రూ.193.15 దగ్గర క్లోజైంది.

14 నెలల గరిష్టానికి..

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్ దూసుకుపోతోంది. వరుస లాభాలతో ఉన్న ఈ స్టాక్ ఈ రోజు కూడా 12 శాతం వరకూ పెరిగింది. వాల్యూమ్స్ 11 రెట్లు పెరిగాయి. చివరకు రూ.18.07 దగ్గర స్టాక్ ముగిసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+