డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. మంగళవారం రూపాయి మారకం విలువ 69.62 వద్ద క్లోజ్ అయింది. అయితే బుధవారం మధ్యాహ్నం 24 పైసలు తగ్గి 69.86 వద్ద ట్రేడ్ అయింది. ప్రారంభం కావడమే 69.76 వద్ద స్టార్ట్ అయింది. ఓ సమయంలో 69.98 పైసలకు చేరుకుంది. అంటే దాదాపు రూ.70కి చేరువలో వచ్చింది. మంగళవారం నాటితో పోల్చితే బలహీనపడింది. దీనికి కారణం ఆయిల్ ధరలు. ఇరాన్ నుంచి క్రూడాయిల్ సరఫరా జీరో కావాలని భారత్, చైనా సహా ఎనిమిది దేశాలకు అమెరికా అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. డాలర్‌తో రూపాయి బలహీనపడటానికి పలు కారణాలు ఉన్నాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70 మార్క్ దాటవచ్చునని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సమీప రోజుల్లో 69.60 నుంచి 70.05 మధ్య ట్రేడ్ కావొచ్చునని చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ పైన అమెరికా ఆంక్షలు అని చెబుతున్నారు. ఆసియా మార్కెట్లో ఆయా కరెన్సీలు డాలర్‌తో పోల్చితే బలహీనపడ్డాయి. అలాగే, ఆయిల్ ప్రైసెస్ పడిపోయాయి. అయినప్పటికీ అధికంగానే ఉన్నాయి.

బ్రెంట్ క్రూడాయిల్ గత క్లోజింగ్ బ్యారెల్‌కు 74.17 డాలర్లు వద్ద నిలిచింది. దీని కంటే 0.5 శాతం తగ్గింది. మంగళవారం క్రూడాయిల్ ధరలు ఆరు నెలల హైకి పెరిగిన విషయం తెలిసిందే. క్రూడాయిల్ ధరల ప్రభావంతో డొమెస్టిక్ స్టాక్ మార్కెట్స్ స్ట్రగుల్ అయ్యాయి. క్రూడాయిల్ ధరల బ్యారెల్‌కు 75 డాలర్లు అయినా ఇండియన్ మాక్రో ఎకనామిక్ పొజిషన్ పైన ప్రభావం పడుతుందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications