రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ఏడాది చివరలో ఫుడ్, గ్రాసరీస్ కోసం రిటైల్ యాప్ తీసుకురానుంది. అంతకుముందే రిలయన్స్ ఈ యాప్‌ను టెస్ట్ చేస్తోంది. రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ గ్రాసరీ యాప్ ఈ ఏడాది చివర్లో వరకు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. రిలయన్స్ ఏ రంగంలో అడుగు పెట్టినా విజయం వరిస్తోంది. ఇటీవల జియో రిలయన్స్ టెలికం రంగంలో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ ఈ కామర్స్‌ను కొత్తగా తీసుకు వస్తోంది. ఆన్‌లైన్ టు ఆఫ్ లైన్ (O2O) పద్ధతిని ఎంచుకుంది.
ఈ-కామర్స్‌కు రిలయన్స్ రిటైల్ బాగా సూట్ అవుతుందని, రిలయన్స్ వద్ద ఫండ్ ఉందని, పెద్ద ఎత్తున అనుబంధ స్టోర్లు, ఉద్యోగులు ఉన్నారని, బ్రాండింగ్ ఉందని, ఈ దీపావళికి కాకపోయినా వచ్చే ఏడాదిలోపు ఇది లాంచ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఇన్న ఈ-కామర్స్ సంస్థలకు పోటీగా ఉండనుందని, అలాగే కొత్త బయ్యర్స్‌ను అట్రాక్ట్ చేయవచ్చునని, ఈ రంగానికి ఇది మంచిదని అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ O2O పద్ధతిని ఎంచుకుంది. ఇందులో కన్స్యూమర్ ప్రాడక్ట్‌ను ఆన్‌లైన్ ద్వారా చూసుకొని, ఆఫ్ లైన్ ఛానల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ద్వారా వ్యాపారులను ఒకే ప్లాట్ ఫాం పైకి తీసుకురావడం రిలయన్స్ ఉద్దేశ్యం. యజమానులు రిలయన్స్ ఈ కామర్స్ యాప్‌తో పేమెంట్ స్వీకరిస్తారు. వస్తువు రవాణా, ఆర్డర్లు స్వీకరించడం ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. దుకాణ యజమానులు ఈ యాప్ ద్వారా ట్యాక్స్ కట్టవచ్చు.


Click it and Unblock the Notifications