For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెల రోజుల కనిష్టానికి స్టాక్ మార్కెట్లు.. మూడో రోజూ నష్టాల్లో ముగింపు

By Chanakya
|

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఏప్రిల్ సిరీస్ ముగింపునకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం, బ్యాంకింగ్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఈ రోజు కూడా మార్కెట్లను పడదోశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ నెల రోజుల కనిష్టానికి దిగొచ్చాయి. వరుసగా మూడో రోజు కూడా మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకోవడంతో కొద్దిగా ఒత్తిడికి గురిచేస్తోంది. ఉదయం నుంచి మిశ్రమంగా సాగిన ట్రేడింగ్ మిడ్ సెషన్ తర్వాత మరింతగా నష్టపోయింది. ప్రధాన సూచీలన్నీ బలహీనంగానే ఉన్నాయి. ఇంట్రాడేలో 11646 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరిన నిఫ్టీ అక్కడి నుంచి సుమారు 90 పాయింట్ల వరకూ కోల్పోయింది. చివరకు 19 పాయింట్ల లాస్‌తో 11575 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 80 పాయింట్ల నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 209 పాయింట్ల నష్టంతో 29,480 వద్ద ఆగింది.

ఓఎన్జీసీ, జీ ఎంటర్‌టైన్మెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. మారుతి సుజుకి, యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ స్టాక్స్ లూజర్స్‌గా మిగిలాయి

Markets closing: Sensex, Nifty end lower in a rangebound trade

ఆటో.. సడెన్ షాక్

ఆటో రంగ షేర్లలో ఆఖరి గంటలో అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ప్రధానంగా మారుతి సుజుకి షేర్ ఏకంగా 4 శాతం కోల్పోయింది. ఇదే బాటలో టాటా మోటార్స్, మహీంద్రా, ఐషర్ షేర్లు కూడా కిందికి దిగొచ్చాయి. ప్రధానమైన కారణం ఏదీ తెలియకపోయినప్పటికీ ఆఖరి గంటలో కనిపించిన ఈ సెల్లింగ్ ప్రెషర్ రేపటి ట్రేడింగ్‌పై కూడా ప్రభావాన్ని చూపేలా ఉంది.

జీ ఎంటర్‌టైన్మెంట్

ఎస్సెల్ గ్రూపునకు చెందిన ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజార్టీ వాటాను బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించిన నేపధ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టాక్ ఈ రోజు భారీగా లాభపడింది. ఇంట్రాడేలో రూ.421 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు 3.21శాతం లాభంతో రూ.409.40 దగ్గర క్లోజైంది. వాల్యూమ్స్‌తో సహా స్టాక్ పెరిగింది.
ఇదే రంగానికి చెందిన సన్ టీవీ మాత్రం 3.5 శాతం నష్టంతో రూ.583 దగ్గర క్లోజైంది.

లుపిన్ - మోర్గాన్ స్టాన్లీ

ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ టార్గెట్ ప్రైస్‌ను అప్ గ్రేడ్ చేస్తూ మోర్గాన్ స్టాన్లీ ఇచ్చిన రిపోర్ట్ స్టాక్‌లో జోరు పెంచింది. ఓవర్ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్‌కు రేటింగ్‌ను అప్ గ్రేడ్ చేయడంతో పాటు టార్గెట్‌ను రూ.783 నుంచి రూ.1094కి పెంచింది. దీంతో ఈ స్టాక్ 4.32 శాతం పెరిగి రూ.868 దగ్గర క్లోజైంది.

రిలయన్స్ క్యాపిటల్ - అడాగ్

ఓవర్ సోల్డ్ జోన్‌లోకి జారుకున్న అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్‌ ఈ రోజు కొద్దిగా కోలుకున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మినహా మిగిలిన షేర్లు లాభాల్లోకి వచ్చాయి. ప్రధానంగా రిలయన్స్ క్యాపిటల్ 6.2 శాతం పెరిగి రూ. 144 దగ్గర క్లోజైంది. రిలయన్స్ డిఫెన్స్ కూడా 9 శాతం లాభపడింది. మే నెల సిరీస్ ఎఫ్ అండ్ ఓ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టాక్‌ను తొలగించారు. దీంతో ఆ స్టాక్ మరింత పతనమైంది.

జెట్ ఎయిర్‌కు మళ్లీ రెక్కలు

జెట్ ఎయిర్ స్టాక్‌ ఈ రోజు కాస్త తేరుకుంది. ఈ సంస్థకు చెందిన టైం స్లాట్స్‌ను తాత్కాలికంగానే ఇతర ఎయిర్ లైన్స్‌కు కేటాయించామని, సేవలు కొనసాగితే మళ్లీ వాటిని రిలీజ్ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. దీంతో జెట్ ఎయిర్ స్టాక్ లాభపడింది. 10 శాతం పెరిగి రూ.170 దగ్గర క్లోజైంది.

లాభాల స్వీకరణ

ఈ మధ్య భాగా పెరిగిన న్యూజెన్ సాఫ్ట్, రాణే హోల్డింగ్స్, గార్డెన్ రీచ్ షిప్, సాగర్ సిమెంట్స్ వంటి స్టాక్స్‌ 5 శాతానికిపైగా నష్టపోయాయి. ప్రధానంగా లాభాల స్వీకరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

English summary

నెల రోజుల కనిష్టానికి స్టాక్ మార్కెట్లు.. మూడో రోజూ నష్టాల్లో ముగింపు | Markets closing: Sensex, Nifty end lower in a rangebound trade

Sensex sheds 80 pts on crude oil woes, Nifty ends at 11,576; Jet rallies 9%, Infibeam tanks 8%.
Story first published: Tuesday, April 23, 2019, 17:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X