ఇండియా పోస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) దేశవ్యాప్తంగా 1,50,000 పోస్టాఫీసులను ఆధునికీకరించింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీసీఎస్ వెల్లడించింది. మరింత మెరుగ్గా సేవలు అందించేలా వీటిని మోడర్నైజ్ చేసినట్లు తెలిపారు. 2013లో ఇండియా పోస్ట్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా దీనిని పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1,100 కోట్లు.
ఈ కాంట్రాక్ట్ ప్రకారం మానవ వనరులు, ఫైనాన్స్, అకౌంటింగ్ తదితర విభాఘాల కార్యకలాపాలను అనుసంధానం చేసే కోర్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ (సీఎస్ఐ) ప్రోగ్రాంను రూపొందించినట్లు తెలిపింది. అమలు చేసినట్లు తెలిపింది. ఇది అయిదు లక్షల పై చిలుకు ఉద్యోగులకు తోడ్పాటు అందించేదిగా, రోజుకు 30 లక్షల పైచిలుకు లావాదేవీల నిర్వహణ మొదలైన వాటికి ఉపయోగపడేలా ఉందని పేర్కొంది.

24వేలకు పైగా పోస్టాఫీసుల్లో 80వేలకు పైగా పాయింట్ ఆఫ్ సేల్స్ (ఐవోఎస్) టెర్మినల్స్‌కు అవసరమైన సొల్యూషన్స్ అందించామని, వినియోగదారుల సేవలకు సంబంధించి వివిధ భాషల్లో కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ ఒప్పందంలో భాగంగా ఆధునిక టెక్నాలజీ, వ్యవస్థలను ఇండియ్ పోస్ట్‌లోకి తీసుకు వచ్చి మరిన్ని అదనపు సేవలను ఖాతాదారులకు ప్రభావవంతంగా చేరేవేసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది.
ప్రపంచంలోనే ఎంతో పెద్ద డిస్ట్రిబ్యూటెడ్ ఈ-పోస్టల్ నెట్ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నట్లు టీసీఎస్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని డాక్ సేవకులు మారుమూల గ్రామాల్లో కూర్చొని తపాలా, బ్యాంకింగ్, బీమా, నగదు నిర్వహణ సేవలు అందించడం కోసం దర్పణ్ అనే పరికరం తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఈ పరికరం ద్వారా నెట్ వర్క్ కనెక్టివిటీ లేకపోయినా సేవలు అందించవచ్చునని తెలిపారు. దేశం గర్వించేలా తపాలా శాఖను భవిష్యత్తు అవసరాలకు తగిన డిజిటల్ ప్లాట్ ఫాంలోకి మార్చామని, దీంతో తపాలా సేవలు స్మార్ట్‌గా మారుతున్నాయన్నారు.


Click it and Unblock the Notifications