ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ తమ అన్ని సర్వీసులను నాలుగు రోజుల క్రితం తాత్కాలికంగా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిలిచిన ఈ విమానాలపై స్పైస్ జెట్, ఎయిరిండియా దృష్టి సారించాయి. ఇప్పటికే స్పైస్ జెట్... జెట్ ఎయిర్వేస్ బోయింగ్ 737 విమానాకి రీపేయింట్ వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
స్పైస్ జెట్ విమానానికి spice jet అనే లెటర్స్ ఎరుపు రంగులో ఉంటాయి. వెనుక భాగం (తోక) కూడా ఎరుపు రంగులో ఉండి, లైట్ ఎల్లో చుక్కలు ఉంటాయి. జెట్ ఎయిర్వేస్ విమానానికి jet airways అని నీలం రంగులో ఉంటుంది. దానికి కింద ముందు వైపు పసుపు రంగులో, మధ్య నుంచి వెనుక (తోక భాగం) వరకు డీప్ బ్లూ రంగులో ఉంటుంది. తోక భాగంలో పైవైపున డీప్ బ్లూలో పసుపు రంగు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటింతో జతకూడిన ఓ పిక్ వైరల్‌గా మారింది. జెట్ ఎయిర్వేస్‌కు చెందిన ఓ బోయింగ్ 737 విమానాన్ని స్పైస్ జెట్ తీసుకొని తమ కంపెనీ రంగులు వేసుకుంటోంది.

మరోవైపు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా జెట్ ఎయిర్వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానాలను లీజుకు తీసుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే ఈ విమానాలకు చెల్లింపులు జరపకపోవడంతో పలు విమానాశ్రయాల్లో నిలిపి ఉంచారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 16వ తేదీనాటికి జెట్ సంస్థ మొత్తం విమానాలను పక్కనపెట్టింది.
దీంతో ఆ సంస్థ నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయి. దీంతో జెట్‌కు చెందిన విమానాలను తీసుకునే అంశాన్ని ఎయిరిండియా ఇప్పటికే చర్చించింది. అయిదు 777 విమానాలను తీసుకొనే అవకాశముంది. తాము విమానాలను లీజుకు తీసుకుందామని భావిస్తున్నామని, కానీ దీనిపై ఎటువంటి చర్చలు జరగలేదని, ఈ విషయం వివిధ అంశాలతో ముడిపడి ఉందని ఎయిరిండియా ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ తెలిపారు.


Click it and Unblock the Notifications