ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్కు మరో షాక్. ఆ సంస్థ డైరెక్టర్ నసీమ్ జైదీ సోమవారం రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాలతో డైరెక్టర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యక్తిగత కారణాలరీత్యా తాను ఏప్రిల్ 21 వతేదీ నుంచి వైదొలుగుతున్నట్లు చెప్పారు.
ఈ మేరకు జెట్ ఎయిర్వేస్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సమాచారం అందించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులను రద్దు చేసిన అనంతరం డైరెక్టరు నసీం జైదీ డైరెక్టరుగా వైదొలగడం గమనార్హం. నసీమ్ జైదీ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అలాగే మాజీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. గత ఏడాది ఆగస్ట్ నెలలో జెట్ ఎయిర్వేస్‌లో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉండగా జెట్ ఎయిర్వేస్ ఉద్యోగాలు చాలా తక్కువ వేతనాలకు ఇతర ఎయిర్ లైన్స్ సంస్థల్లో చేరుతున్నారు.

ఆశించినస్థాయిలో లేని జీతాలు
జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతబడటంతో ఇందులోని 23వేల మంది ఉద్యోగుల భవితవ్యం రోడ్డున పడింది. ఇందులోని చాలామంది నిపుణులను ఇతర విమానయాన సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. కానీ తక్కువ వేతనంతో ఎక్కువ అనుభవం కలిగిన ఉద్యోగులను తీసుకుంటోంది. ఎయిర్ లైన్స్‌కు ఇది బంపరాఫర్. పైలట్లు, కేబిన్ సిబ్బంది, ఇంజినీర్లు తక్కువ వేతనాలకు వెళ్తున్నారు. జెట్ ఉద్యోగులు ఇతర సంస్థల వైపు చూస్తున్న ఉద్యోగులకు అవకాశాలు బాగానే వస్తున్నా జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ ఆయా సంస్థలు వీరికి తక్కువ జీతాలనే ఇస్తున్నాయని అంటున్నారు.

ఇతర రంగాల్లోకి కూడా జెట్ ఉద్యోగులు
నాన్ మెట్రో నగరాల్లో పని చేసేందుకు సిద్ధపడే జెట్ ఉద్యోగులకు మాత్రమే ఇతర ఎయిర్‌లైన్స్ దాదాపు జెట్ ఎయిర్వేస్ స్థాయిలో జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయట. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పని చేయలేమని, మెట్రో నగరాల్లోనే తమకు పోస్టింగ్‌లు కావాలంటే మాత్రం జెట్‌లో ఇచ్చిన జీతాల కంటే 30 నుంచి 50 శాతం కోత పెడుతున్నాయట. ఈఎంఐల వంటి పలు కారణాల వల్ల కొత్త ఉద్యోగాల్లో చేరుతున్నారు. జెట్‌లో పని చేసిన పైలట్లు, కేబిన్ సిబ్బంది, ఇంజనీర్లు, గ్రౌండ్ డ్యూటీ సిబ్బందిలో ఎక్కువ మందికి, ఇతర విమానయాన కంపెనీల్లోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. విమానయానంతో సంబంధం లేని ఇతర ఉద్యోగుల విషయంలోనే కొద్దిగా ఇబ్బంది ఎదురవుతోందట. పలువురు ఇతర రంగాల కంపెనీల్లో ప్రజాసంబంధాలు, కస్టమర్ రిలేషన్స్ మేనేజర్‌వంటి ఉద్యోగాల్లో చేరుతున్నారట.

500 మందిని తీసుకున్న స్పైస్ జెట్
స్పైస్‌జెట్ 500లకుపైగా జెట్ ఉద్యోగులను తీసుకుంది. ఇందులో 200 మందికిపైగా కేబిన్ సిబ్బంది, మరో 200 మందికిపైగా టెక్నికల్, ఎయిర్ పోర్ట్ సిబ్బంది, 100 మంది పైలట్లు ఉన్నారు. మరికొంతమందిని తీసుకుంటామని స్పైస్ జెట్ చెబుతోంది. కొత్త నియామకాల్లో జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులకు తొలి ప్రాధాన్యతనిస్తామని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. జెట్ ఈక్విటీలో మెజార్టీ వాటా 76 శాతంను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకుంటే దివాళా ప్రక్రియ కింద ఎన్‌సీఎల్టీని ఆశ్రయించడం కంటే జెట్ ఆస్తులు అమ్మి వచ్చిన సొమ్ములు రాబట్టుకోవాలని చూస్తున్నారట.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications