2019లో మొట్టమొదటిసారిగా స్టాక్ మార్కెట్ సూచీలు ఒకే రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ కుతకుతలు, రిలయన్స్ నిరుత్సాహక ఫలితాలకు తోడు బ్యాంకింగ్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ సూచీలను కుప్పకూల్చాయి. నిఫ్టీ 11600 పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా దాదాపు 500 పాయింట్లు కోల్పోయింది. ఉదయం నుంచి నిరుత్సాహంగానే సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత మరింత ఒత్తిడికి లోనయ్యాయి. చివరకు నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 11594 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 495 పాయింట్లు నష్టపోయి 38645 దగ్గర క్లోజైంది.
బేర్‌మన్న బ్యాంకులు
బ్యాంక్ నిఫ్టీ అక్టోబర్ 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే ఒకే రోజులో భారీ స్థాయి పతనాన్ని నమోదు చేసింది. ఏకంగా 535 పాయింట్లు నష్టపోయి 29687 దగ్గర ముగిసింది. ప్రధానంగా యెస్ బ్యాంక్ 7 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 4.5 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4 శాతం నష్టపోయాయి. ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 3 శాతం వరకూ కోల్పోయాయి.
ఇదే కోవలో ఫైనాన్షియల్ స్పేస్ స్టాక్స్‌లో ఇండియాబుల్స్ హౌసింగ్ 9 శాతం, ఐబీ వెంచర్స్ 6 శాతం నష్టపోయాయి. ఇదే బాటలో ఎడిల్వైజ్, చోలా ఫైనాన్స్, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్,ఆర్ఈసీ కూడా నాలుగు శాతానికి పైగానే కోల్పోయాయి.

విప్రో, ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టిసిఎస్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, యెస్ బ్యాంక్, బిపిసిఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్ప్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
రిలయన్స్ పడేసింది
మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నీరసించింది. పెట్రో కెమ్, రిఫైనింగ్ డివిజన్స్‌లో నీరసం మార్కెట్లను రుచించలేదు. దీంతో ఈ స్టాక్ ఏకంగా 3 శాతానికి పైగా కోల్పోయింది. హెవీ వెయిట్ స్టాక్ కావడంతో నిఫ్టీని కిందికి తీసుకురావడంలో ఈ స్టాక్ ప్రధాన పాత్ర పోషించింది. చివరకు 2.93 శాతం నష్టంతో రూ.1345.35 దగ్గర క్లోజైంది.
ఇదే బాటలో హెచ్ డి ఎఫ్ సి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, యెస్ బ్యాంక్ స్టాక్స్ కూడా పతనమై మార్కెట్లను మరింత దిగజార్చాయి.
క్రూడ్ ఎఫెక్ట్
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 5 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఇరాన్ దగ్గర చమురు తీసుకునే వాళ్లకు ప్రోత్సాహకాల నిలిపివేస్తామంటూ యూఎస్ హెచ్చరించడంతో క్రూడ్ 3 శాతానికి పైగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 74 డాలర్ల మార్కును దాటింది. దీంతో దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం 6.5 శాతం నష్టపోయాయి. ఇండియన్ ఆయిల్ స్టాక్ 4 శాతం నష్టాలతో ముగిసింది.
జెట్ స్పీడ్ రికవరీ
ఇంట్రాడే ఓపెనింగ్‌లోనే 13 శాతానికి పైగా నష్టపోయిన జెట్ ఎయిర్ స్టాక్ ఆఖరి అరగంటలో పుంజుకుంది. రూ.127 కనిష్టానికి దిగొచ్చిన స్టాక్ తేరుకుని 6 శాతం నష్టంతో రూ.154.60 దగ్గర ముగిసింది. కొత్తగా రుణదాతలు ఎవరూ ముందుకు రాకపోయినప్పటికీ జెట్‌కు చెందిన టైమ్ స్లాట్స్‌ను ఎవరికీ ఇవ్వొద్దనే ఒత్తిడి పెరిగింది. దీంతో స్టాక్ కొద్దిగా తేరుకుంది.
ఇదే రంగానికి చెందిన విమాన సంస్థలకు క్రూడ్ షాక్ తగిలింది. ఈ మధ్య విపరీతంగా పెరిగిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణ నమోదైంది. స్పైస్ జెట్ 8 శాతం, ఇండిగో 4.3 శాతం నష్టంతో రూ.1489 దగ్గర ముగిసింది.
అడాగ్ నష్టాల ఎటాక్
అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూపునకు చెందిన స్టాక్స్‌లో మళ్లీ భారీ పతనం నమోదైంది. ప్రధానంగా రిలయన్స్ క్యాపిటల్‌ను బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీ డౌన్ గ్రేడ్ చేయడం మరింత దిగజార్చింది. రిలయన్స్ క్యాపిటల్ 12 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 5 శాతం పతనమయ్యాయి. రిలయన్స్ హోం ఫైనాన్స్, రిలయన్స్ డిఫెన్స్ కూడా 5 శాతం వరకూ పడిపోయాయి. ఇక ఈ గ్రూప్ స్టాక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే సలహా ఇస్తున్నారు ఎనలిస్టులు.
రూపాయి పడితే వీళ్లకు లాభం
క్రూడ్ ఎఫెక్ట్‌తో రూపాయి నీరసించింది. సుమారు 30పైసల వరకూ డాలర్‌తో వీక్ కావడంతో ఐటీ స్టాక్స్‌కు కలిసొచ్చింది. విప్రో 1.5 శాతం వరకూ లాభపడింది. టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, ఇన్ఫోసిస్, టిసిఎస్ స్టాక్స్ ఒక్క శాతం వరకూ పెరిగాయి.
ప్రాఫిట్ బుకింగ్
గతవారమంతా భారీ లాభాలను మూటగట్టుకున్న పిసి జ్యువెలర్స్ వంటి స్టాక్స్‌లో లాభాల స్వీకరణ స్పష్టంగా కనిపించింది. ఈ స్టాక్ 11 శాతం నష్టపోయి రూ.129 దగ్గర క్లోజైంది. దివాన్ హౌసింగ్ 11 శాతం, అఫోలో మైక్రో 7 శాతం, ప్రికాల్ 6.5 శాతం, 8కె మైల్స్ 6 శాతం నష్టపోయాయి.
ఇక కొన్ని ప్రధాన స్టాక్స్ అయిన ఎవరెడీ ఇండస్ట్రీస్, గ్రాబ్ టీ, హెచ్ ఈ జీ, నాట్కో ఫార్మా, ఎస్ చాంద్, స్టీల్ స్ట్రిప్స్ వీల్స్, వార్కో ఇంజనీరింగ్ వంటి స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి.
More From GoodReturns

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్‌పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..



Click it and Unblock the Notifications