న్యూఢిల్లీ: అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్ష్యంతో అయిదేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ జన్ ధన్ యోజన ప్రారంభించారు. ఇది సూపర్ సక్సెస్ అయింది! ఏదో పేరుకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి, అలా మూలకు పడవేస్తారని చాలామంది భావించారు. కానీ జన్ ధన్ స్కీం ద్వారా ఓపెన్ అయిన ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బులు జమ చేయబడ్డాయట. ఈ ఖాతాల్లో జమ చేయబడిన మొత్తం రూ.లక్ష కోట్లకు చేరువలో ఉందట. ఏప్రిల్ 3వ తేదీ నాటికి అక్షరాలా రూ.97,665.66 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాల ద్వారా వెల్లడైంది. జన్ ధన్ ఖాతాల సంఖ్య కూడా 35.39 కోట్లు దాటింది. జన్ ధన్ ఖాతాల్లో మార్చి 27వ తేదీ నాటికి 96,107.35 కోట్లు ఉండగా, అంతకుముందు వారం 95,382.14గా ఉన్నాయి. 27.89 కోట్ల మందికి రూపే కార్డులు జారీ చేశారు.

ప్రమాద బీమా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంపు
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)ని ఆగస్ట్ 28వ తేదీన ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో దీనిని లాంచ్ చేశారు. జన్ ధన్ మంచి సక్సెస్ అయింది. ఆగస్ట్ 28, 2018 తర్వాత ఈ ఖాతాలను ప్రారంభించిన వారికి ప్రమాద బీమాను రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు.

ఎమర్జెన్సీ సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ లాభం
ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్‌ను రెండింతలు (రూ.10,000) చేశారు. ఈ బ్యాంకు ఖాతాలో ఆరు నెలల పాటు లావాదేవీలు సాగి, ఆధార్ కార్డుకు అనుసంధానం చేస్తే మొదట రూ.2500 ఓవర్ డ్రాఫ్టుకు అర్హులు అవుతారు. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. జన్ ధన్ యోజన కింద అకౌంట్ తీసుకున్న వారు నెలకు రూ.10వేల బదలీ సౌకర్యం మాత్రమే కలిగి ఉంటారు. సంవత్సరానికి రూ.1 లక్ష వరకు బదలీ లేదా సేవింగ్ అవకాశముంది.

50 శాతానికి పైగా మహిళలే
కష్టార్జితాన్ని బ్యాంక్ ఖాతాలలో పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాల లబ్ధిని యాక్సెస్ చేసుకునే అవకాశముంది. ఇన్సురెన్స్ వంటి అవకాశం కల్పిస్తుంది. జన్ ధన్ యోజన కింద ఖాతాలు తెరిచినవారిలో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారు. ఇక, 59 శాతం వరకు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారే ఖాతాలు తెరిచారు. ప్రభుత్వం ప్రతి ఖాతా పైన కూడా దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications