హైదరాబాద్ ఐటీ మరో ఫీట్ : ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో బెంగళూరు వెనక్కి నెట్టిన భాగ్యనగరం
న్యూఢిల్లీ : ఐటీ విభాగంలో హైదరాబాద్ మరో ఫీట్ సాధించింది. ఆఫీస స్పేస్ లీజింగ్‌లో బెంగళూరును వెనక్కి నెట్టి ముందువరసలో నిలిచింది. ఈ పరిణామం విశేషమని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదికలో పేర్కొంది.

9 నగరాల్లో పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ స్వల్పంగా పెరిగి ..1.28 కోట్ల చదవరపు అడుగులు (ఎస్ఎఫ్టీ)కి చేరుకుంది. హైదరాబాద్ లో అద్దెకిచ్చిన ఆఫీస్ స్పేస్ పెరగడం మంచి పరిణామమని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది. గతేడాది ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, కోచిలో ఎస్ఎఫ్టీ 1.26 కోట్లుగా ఉంది.

ఇక నిలకడ .. కారణం ఏంటంటే ?
కార్పొరేట్ కంపెనీలు తమ కార్యకలాపాల విస్తరణ కోసం ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో స్వల్పకాలంలో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాల నిలకడగా ఉండవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ తెలిపారు. భారత ఔట్ సోర్సింగ్ కు ప్రధాన గమ్యస్థానంగా మారిన నేపథ్యంలో యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఎపాక్ దేశాల కార్పొరేట్లకు భారత్ ప్రధాన ఆకర్షణగా ఉండనుందని పేర్కొన్నది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ, పారిశ్రామిక కారిడార్లు వంటి దేశీయ, బహుళజాతి కార్పొరేట్ల కార్యకలాపాలు పుంచుకోవడానికి దోహదపడుతాయని పేర్కొన్నారు.

మూడింతలు పెరిగిన ఆఫీస్ స్పేస్
9 నగరాల్లో అద్దెకు తీసుకున్న ఆఫీసు స్పేస్ లో టెక్ కార్పొరేట్స్ వాటా 33 శాతం, కో-వర్కింగ్ ఆపరేటర్ల వాటా 16 శాతంగా ఉంది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో టెక్ కార్పొరేట్స్ వాటా 22 శాతంగా ఉంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల వాటా 5 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఈ జనవరి మార్చిలో హైదరాబాద్ లో ఆఫీసు స్పేస్ లీజింగ్ 35 లక్షల చదరపు అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 11 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అంటే మూడింతలు పెరిగినట్టు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications