హైదరాబాద్ : నాణ్యమైన వస్తువుకు హాల్ మార్క్ కంపల్సరీ. ఇక బంగారం సంగతి చెప్పక్కర్లేదు. అయితే 14,18,22 క్యారెట్ల గోల్డ్ మాత్రమే ప్రస్తుతం హాల్ మార్క్ ఉంటోంది. మిగతా 20, 23, 24 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్క్ తప్పనిసరి ఉండాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ కోరుతోంది.

22 క్యారెట్లలో గోల్డ్
దేశంలో ఎక్కువగా 22 క్యారెట్ల రూపంలోని నగలు రూపొందుతున్నాయి. కొన్నిచోట్ల ఇరత క్యారెట్లలో కూడా ఆభరణాలను తయారు చేస్తున్నారు. అయితే విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు హాల్ మార్కింగ్ తప్పనిసరి అవుతోంది.

916 అంటే ?
హాల్ మార్క్ కు బ్రాండ్ 916. అంటే వంద గ్రాముల బంగారు నగలలో ప్యూర్ గోల్డ్ 91.6 శాతం ఉంటోంది. బంగారు నగలలో ప్యూర్ గోల్డ్ ఎంత ఉందనేది హాల్ మార్కింగ్ తో తెలుసుకోవచ్చు. నగలలో ఇతర లోహాల శాతం ఎక్కువ కూడా ఉండే అవకాశాలు ఉన్నందున .. కొనే నగలలో హాల్ మార్కింగ్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

22 క్యారెట్ల బంగారమే వినియోగం
దేశవ్యాప్తంగా తయారయ్యే నగలలో 90 శాతం 22 క్యారెట్ల బంగారాన్ని వాడుతున్నారు. మిగతా 10 శాతం ఇతర క్యారెట్ల బంగారంతో రూపొందిస్తున్నారు. డైమండ్ నగలలో ఎక్కువగా 21 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తారు. కానీ 21 క్యారెట్ల బంగారానికి హాల్ మార్కింగ్ లేదు. డైమండ్ నాణ్యతకు హామీ ఇస్తున్నట్టు లెక్క. డైమండ్ నగల తయారీలో వాడే 21 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ ఉండే కస్టమర్లకు మరింత నమ్మకం ఉంటుంది.

అందుకోసమే హాల్ మార్క్ ..
ఇప్పటివరకు స్విట్జర్లాండ్ నుంచి బంగారు బార్లు దిగుమతయ్యేవి. వాటిపై నాణ్యతను తెలియజేస్తూ స్విస్ లో ముద్రించేవారు. ఇప్పుడు ముంబైతోపాటు ఇతర నగరాల్లో కూడా బంగారు బార్లు, బిస్కెట్లు, కాయిన్ల తయారీ జరుగుతోంది. వీటి నాణ్యత తెలుసుకోవడం కష్టమవుతోంది. అందుకోసమే హాల్ మార్కింగ్ ఉండాలని వ్యాపారులు కోరుతున్నారు. దీంతో కస్టమర్లకు భరోసా కలుగుతోందని చెప్తున్నారు. బంగారంలో హాల్ మార్కింగ్ కంపల్సరీ అని, అన్నిరకాల్లో హాల్ మార్కింగ్ ఉంటే పారదర్శకత పెరగడంతోపాటు మోసాలను అరికట్టవచ్చని బంగారం వ్యాపారులు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications