రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంతకాలం పెట్రోకెమికల్, రిఫైనింగ్ రంగాలపైనే అధికంగా ఆధారపడేది. ఇంతకాలం సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ వ్యాపారంలో మెల్లిగా లాభాలు తగ్గుతున్నాయి. భవిష్యత్తును ముందే ఊహించిన ముకేష్ అంబానీ దశాబ్ద కాలంలో రిలయన్స్ రిటైల్‌పై ఎక్కువగా దృష్టిపెడ్తూ వచ్చారు. అదే సమయంలో రెండేళ్ల క్రితం నుంచి జియోపై కూడా ఫోకస్ పెంచారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో రిటైల్, జియో సంస్థల నుంచి అనూహ్యమైన లాభాలు వచ్చిపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో రిలయన్స్ జియో 65 శాతం, రిటైల్ డివిజిన్ 52 శాతం వృద్ధిని నమోదు చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ రెండు సంస్థలే రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ముందుకు నడిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
రిలయన్స్ రిటైల్ దూకుడు
రిలయన్స్ రిటైల్ డివిజిన్ మొట్టమొదటిసారిగా రూ.లక్ష కోట్ల ఆదాయం మార్కును దాటింది. ఈ క్వార్టర్లో సంస్థ రూ.36663 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది నిరుటితో పోలిస్తే 51.6 శాతం అధికం. ఎబిటా 81 శాతం పెరిగి రూ.1721 కోట్లకు చేరింది. మొత్తం ఆర్థిక సంవత్సర పరంగా చూస్తే రిలయన్స్ రిటైల్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,30,566 కోట్ల ఆదాయాన్ని మూటగట్టుకుంది. 2018లో ఇది రూ.69918 కోట్లుగా ఉండేది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10415 రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఇవన్నీ 2.2 కోట్ల స్క్వేర్ ఫూట్‌లో ఉన్నాయి. రిలయన్స్ రిటైల్, ఫ్రెష్ స్టోర్ల సంఖ్య ఇప్పుడు 612కి చేరింది. దేశంలో 10 వేలకు పైగా చైన్ స్టోర్లను కలిగిన ఏకైక రిటైల్ సంస్థగా రికార్డ్ నమోదు చేసింది. 6600 నగరాల్లో రిటైల్ తన సేవలను అందిస్తోంది.

జియో కూడా లాభాల్లోకి..
ఈ మధ్యే మొదలైన రిలయన్స్ జియో వ్యాపారం కూడా అప్పుడే ఫలితాలను మొదలుపెట్టింది. క్యూ4లో జియో రూ.840 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఒక్కో యూజర్ ద్వారా వచ్చే రెవెన్యూ రూ.126.2కు చేరింది. జియో గిగా ఫైబర్ త్వరలో 1600 నగరాలకు విస్తరింపజేస్తున్నారు. ఇప్పుడు జియో ద్వారా యావరేజ్ డేటా వాడకం నెలకు 10.9 జిబికి చేరింది. వాయిస్ వాడకం కూడా నెలకు 823 నిమిషాలకు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications