ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జనవరి-మార్చి త్రైమాసికానికి గాను రూ.10,362 కోట్ల లాభాన్ని ప్రకటించింది. అంటే షేరుకు రూ.17.5 (ఈపీఎస్) ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.9,438 కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో దేశంలోనే రూ.10,000 కోట్ల త్రైమాసిక లాభాన్ని పొందిన తొలి ప్రయివేటు కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక ఏడాది లక్ష కోట్ల ఆదాయ మైలురాయిని అందుకున్న తొలి ఇండియన్ రిటైల్ కంపెనీ రిలయన్స్. 2018-19 ఏడాదికి గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ టోటల్ ఇన్‌కం 1,30,556 కోట్లు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను తాము ఎన్నో మైలు రాళ్లు అందుకున్నామని, ఎంతో ప్రగతి సాధించామని కంపెనీ అధినేత ముఖేష్ పేర్కొన్నారు. రిలయన్స్ రిటైల్ రూ.1,00,000 కోట్ల రెవెన్యూ మైల్ స్టోన్ దాటిందని చెప్పారు. రిలయన్స్ ఐదు మైండ్ బ్లోయింగ్ లెక్కలు చూడండి.

రూ.10,000 కోట్ల ప్రాఫిట్ ఇది రెండోసారి
రిలయన్స్ ఇండస్ట్రీస్ జనవరి - మార్చి త్రైమాసికంలో రూ10,362 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఇలా రూ.10వేల కోట్లకు పైగా ప్రకటన చేయడం ఇది రెండోసారి. అంతకుముందు త్రైమాసికంలో దేశంలోనే రూ.10,000 కోట్ల త్రైమాసిక లాభాన్ని పొందిన తొలి ప్రయివేటు కంపెనీగా చరిత్ర సృష్టించింది. రిలయన్స్ రెవెన్యూ 19.4 శాతం పెరిగి 1,54,110 కోట్లుగా నమోదయింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఆదాయం రూ.1,29,120 కోట్లుగా ఉంది.

రిలయన్స్ జియో క్వార్టర్ ఫిగర్
రిలయన్స్ జియో రూ.840 కోట్ల ప్రాఫిట్ ప్రకటించింది. అంతకుముందు, డిసెంబర్ త్రైమాసికంలో రూ.831 కోట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది జనవరి - మార్చిలో రూ.510 కోట్ల లాభంతో పోలిస్తే ఈ క్వార్టర్ లాభం 64.7 శాతం ఎక్కువ. నిర్వహణ ఆదాయం కూడా 55.8 శాతం వృద్ధితో రూ.7,128 కోట్ల నుంచి రూ.11,106 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో జియో లాభం నాలుగింతలు పెరిగి రూ.2,585 కోట్లకు చేరుకుంది. నిర్వహణ ఆదాయం 92.7 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లుగా నమోదైంది. ఒక్కో చందాదారుపై సగటు ఆర్జన రూ.126.2గా నమోదైంది. 31 మార్చి 2019 నాటికి 30 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

ఆర్ఐఎల్ రికార్డ్ యాన్యువల్ ప్రాఫిట్
రిలయన్స్ యాన్యువల్ ఏకీకృత లాభాన్ని రూ.39,588గా ప్రకటించింది. 13.1 శాతం పెరుగుదల. ఈ సంస్థ రూ.92,656 కోట్లతో రికార్డ్ వార్షిక పీబీడీఐటీ ఆదాయాన్ని నమోదు చేసింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.6.50 (65%) డివిడెండును బోర్డు సిఫారసు చేసింది.

టాప్ 100 గ్లోబల్ రిటైలర్స్‌లో రిలయన్స్ రిటైల్
గ్లోబల్ రిటైలర్స్ జాబితాలో చేరిన తొలి ఇండియన్ కంపెని రిలయన్స్ రిటైల్. గ్లోబల్ పవర్స్ నివేదిక ప్రకారం అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న రిటైలర్ జాబితాలో రిలయన్స్ రిటైల్ 6వది. ప్రస్తుతం దీనికి 6,600 నగరాల్లో 10,415 రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. అలాగే 516 పెట్రో రిటైల్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ పన్నుకు ముందు లాభం 77.1% పెరిగి రూ.1,923 కోట్లుగా నమోదైంది. ఆదాయం 51.6% వృద్ధితో రూ.36,663 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగ ఆదాయం 88.7% పెరిగి రూ.1,30,566 కోట్లుగా నమోదైంది.

పెరుగుతున్న జియో సబ్‌స్క్రైబర్లు
రిలయన్స్ జియో టెలికం మార్కెట్లో దూసుకెళ్తోంది. 31 మార్చి 2019 నాటికి జియో సబ్‌స్క్రైబర్లు 30 కోట్లకు పైగా ఉన్నారు. గత ఏడాది కాలంలో జియోకు పెరిగిన సబ్‌స్క్రైబర్లు 120 మిలియన్లు. టెలికం రంగంలో గత ఏడాది అత్యంత ఎక్కువ కస్టమర్లు పెరిగింది జియోకు మాత్రమే. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ ఉంది. మిగతా సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లను కోల్పోయాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications