ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా తన సేవలు నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీంతో ముందుగా టిక్కెట్స్ బుక్ చేసుకున్న ఎంతోమంది రీఫండ్ కోసం చూస్తున్నారు. రీఫండ్ విషయం పక్కన పెడితే ప్రణాళికతో టిక్కెట్స్ బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. జెట్ ఎయిర్వేస్‌లో టిక్కెట్స్ బుక్ చేసుకున్న ఇంటర్నేషనల్ ప్రయాణీకులకు ఎయిరిండియా తీపి కబురు అందించింది.

19 రూట్లలో ప్రత్యేక ఆఫర్
19 ఇంటర్నేషనల్ రూట్లలో ఎయిర్ ఇండియా స్పెషల్ ఫేర్స్ ప్రకటించింది. జెట్ ఎయిర్వేస్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకుల కోసం తమ ఎయిరిండియా మార్గాల్లో ప్రత్యేక ఫేర్స్ ప్రకటించింది. ఇది 28 ఏప్రిల్ 2019 వరకు వాలిడ్ అవుతుంది. ఈ మేరకు ఎయిరిండియా ట్వీట్ చేసింది. జెట్ ఎయిర్వేస్‌లో టిక్కెట్ కన్‌ఫర్మ్ అయి పారన్ స్టేషన్స్‌లో ఉండిపోయిన వారికి ఈ నెల 28వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన వివరాలకు ఎయిరిండియా బుకింగ్ కార్యాలయాన్ని లేదా కస్టమర్ కేర్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించింది.

ఈ రూట్లలో ఆఫర్... వీరికి మాత్రమే!
ఎయిరిండియా ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన 19 మార్గాలు ఇవే. Paris-Chennai (CDG-MAA), London-Delhi (LHR-DEL), London-Mumbai (LHR-BOM), Singapore-Delhi (SIN-DEL), Singapore-Mumbai (SIN-BOM), Bangkok-Delhi (BKK-DEL), Bangkok-Mumbai (BKK-BOM), Hong Kong-Delhi (HKG-DEL), Hong Kong-Mumbai (HKG-BOM), Dubai-Delhi (DXB-DEL), Dubai-Mumbai (DXB-BOM), Muscat-Delhi (MCT-DEL), Muscat-Mumbai (MCT-BOM), Abu Dhabi-Mumbai (AUH-BOM), Dammam-Delhi (DMM-DEL), Jeddah-Mumbai (JED-BOM), Riyadh-Delhi (RUH-DEL), Kathmandu-Delhi (KTM-DEL) and Dhaka-Kolkata (DAC-CCU).
అయితే, ఈ స్పెషల్ ఫేర్స్ ఎకానమి క్లాస్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని ఎయిరిండియా తెలిపింది. అలాగే డైరెక్ట్ విమానాలకు వర్తిస్తాయని పేర్కొంది. ఒకవేళ ప్రయాణీకుల వద్ద జెట్ ఎయిర్వేస్ ఈ-టిక్కెట్స్ ఉంటే జెట్ ఎయిర్వేస్ ఆఫీసర్ ధృవీకరణ కోసం రబ్బర్ స్టాంప్ ఉండాలని పేర్కొంది.

ఎస్బీఐకి లేఖ
కాగా, ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ విమాన సేవలు నిలిచిపోయిన కొన్ని రూట్లను టేకోవర్ చేసేందుకు ఎయిరిండియా సిద్ధమైనట్లు గురువారం ప్రకటించింది. గతంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు నడిచిన కొన్ని రూట్లలో తన బోయింగ్ 777 విమానాలను నడిపేందుకు ఎయిరిండియా ముందుకు వచ్చింది. జెట్ ఎయిర్వేస్ రూట్లలో తమ విమాన సేవలను అందించేందుకు సంసిద్ధతం వ్యక్తం చేస్తూ ఎయిరిండియా సీఎండీ అశ్వని లోహని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్‌కు లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతపడటంతో ఆయా రూట్లలో ప్రయాణీకుల అసౌకర్యాన్ని నివారించేందుకు తాము ఈ ప్రతిపాదన చేశామని లేఖలో పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications