వొడాఫోన్ ఐడియా బుధవారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లిక్కర్, సిగరేట్ కంపెనీల వలే తమను ట్రీట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమపై కూడా భారీగా పన్నులు విధిస్తున్నారని ధ్వజమెత్తింది. టెలికం సంస్థలపై కస్టమ్స్ డ్యూటీ కింద 23 శాతం, జీఎస్టీ కింద 18 శాతం విధించడం భావ్యం కాదని, ప్రాధాన్యేతర వస్తువులైన లిక్కర్, సిగరేట్లపై విధిస్తున్న పన్ను తరహాలో విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వొడాఫోన్ ఐడియా సీఈవో బాలేష్ శర్మ అన్నారు.
భారతదేశంలో టెలికం సేవలు అందించేందుకు స్పెక్ట్రం కోసం భారీస్థాయిలో నిధులు వెచ్చించవలసి వస్తుందని, దీంతో అప్పుల పాలవుతున్నామని పేర్కొన్నారు. వీటితో పాటు స్పెక్ట్రం యూసేజ్ ఛార్జీలు, యూఎస్‌వోఎఫ్ ఛార్జీలను, ఇతర ఛార్జీలను టెలికం సంస్థలపై కేంద్రం భారీగా వడ్డిస్తోందని పేర్కొన్నారు.

వొడాఫోన్ ఐడియాకు రూ.1.2 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇందులో 80 శాతం స్పెక్ట్రంకు సంబంధించిన చెల్లింపులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ ఇండియాపై కూడా విమర్శలు గుప్పించారు. డిజిటల్ ఇండియా కావాలంటే టెలికాం సెక్టార్ కూడా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కాబట్టి ముందుగా మౌలిక సదుపాయాలు మెరుగుపరిచిన తర్వాతనే డిజిటల్ ఇండియా బాట పట్టాలన్నారు. టెలికం సంస్థల మధ్య నెలకొన్న పోటీ కారణంగా టారిఫ్‌లు తగ్గిపోయాయని, దీంతో ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతోందన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications