For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైస్ జెట్‌ను ఇక పట్టుకోలేం ! టికెట్ రేట్లు.. స్టాక్ పైపైకి

By Chanakya
|

సుబ్బి చావు ... ఎంకి పెళ్లికొచ్చింది.. అనేట్టు తయారైంది జెట్ ఎయిర్‌వేస్.. స్పైస్ జెట్ మధ్య వ్యవహారం. ఎందుకంటే జెట్ ఎయిర్‌ తాత్కాలిక మూసివేత.. స్పైస్ జెట్‌కు అనూహ్యంగా కలిసొచ్చింది. ఉన్న మూడు లిస్టెడ్ విమానయాన సంస్థల్లో ప్రధాన పోటీదారుగా ఉన్న జెట్.. నేలకూలడం స్పైస్ జెట్ సహా ఇండిగో సంస్థలకు భారీ ప్రయోజనాన్ని చేకూర్చబోతోంది. అందుకే ఈ స్టాక్ ఏకంగా రెండు వారాల్లో 50 శాతం పెరిగి మరింత ఆకర్షణీయంగా మారింది.

Spicejet to gain huge market share after the temporary shut down of jet airways

ఇంటర్నేషనల్ రూట్స్

తాజాగా పోటీని తట్టుకునేందుకు, మరింత మంది ప్రయాణీకులకు దగ్గరయ్యేందుకు కొలంబో, జెడ్డా, ఢాకా, రియాద్, హాంకాంగ్, ఖాట్మండులకు ఇంటర్నేషనల్ రూట్ ఫ్లైట్స్‌ను మొదలుపెట్టింది. త్వరలో మరో 16 బోయింగ్ 737-800NG ఫ్లైట్స్‌ను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇక దేశీయంగా రీజనల్ ఫ్లీట్‌ను 32కు పెంచబోతోంది. త్వరలో 90 సీటర్ల బంబార్డియర్ Q400sను చేర్చబోతోంది. వీటికి తోడు లో కాంపిటీషన్ రూట్లలో స్పైస్ జెట్ తిరుగులేని మార్కెట్ వాటా సంపాదించుకుంటోంది. గువహాతిలో 80 శాతం, జైపూర్‌-గోవాలో 67 శాతం, పూణె-అహ్మదాబాద్-చెన్నైలలో సుమారు 50 శాతం వరకూ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇవే కాకుండా ప్రధాన రూట్లైన ఢిల్లీలో 50 శాతం, ముంబైలో 83 శాతం షేర్ స్పైస్ జెట్ సొంతం. ఇక ఫ్లీట్ సైజ్ పరంగా చూస్తే.. ఇండిగో దగ్గర 209 విమానాలు, స్పైస్ జెట్ దగ్గర 76 విమానాలు ఉన్నాయి.

<strong>జెట్ ఎయిర్వేస్‌లో ఇన్వెస్ట్ చేస్తే అంతే!.. ఇదీ కథ</strong>జెట్ ఎయిర్వేస్‌లో ఇన్వెస్ట్ చేస్తే అంతే!.. ఇదీ కథ

పైపైకి స్టాక్

అటు దేశీయంగా.. ఇటు అంతర్జాతీయంగా కూడా తన సేవలను పెంచిన నేపధ్యంలో స్పైస్‌జెట్‌కు కలిసొస్తోంది. జెట్ కూడా లేకపోవడం వల్ల సీట్ల కొరత ఏర్పడి టికెట్ రేట్లు పెరిగి మార్జిన్లు కూడా మెరుగవుతాయి. ఇవి లాభదాయకతను కొద్దోగొప్పో కొంత కాలమైనా పెంచుతున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ టికెట్ రేట్లు పెంచడంపై కొన్ని ఆంక్షలు విధించినా.. అవి గతంతో పోలిస్తే ఎంతో కొంత ఖచ్చితంగా పెరుగుతాయి అనడంలో సందేహం లేదు. అదే వీళ్లకు కలిసొస్తుంది. అందుకే స్టాక్ కూడా గత వారంలో ఏకంగా 50 శాతం, నెల రోజుల్లో 81 శాతం పెరిగింది. ఇక్కడి నుంచి మరింతగా పెరగడం కష్టమే అయినప్పటికీ.. ఈ స్థాయిల దగ్గర కొద్దిగా లాభాల స్వీకరణ జరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.

English summary

స్పైస్ జెట్‌ను ఇక పట్టుకోలేం ! టికెట్ రేట్లు.. స్టాక్ పైపైకి | Spicejet to gain huge market share after the temporary shut down of jet airways

Spicejet is going to gain huge market share after the temporary shut down of jet airways. Jet air Competitors like indigo and spicejet shares are also sky rocketing with the fall out.
Story first published: Thursday, April 18, 2019, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X