స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల బాట పట్టింది. వీకెండ్‌లో నిరుత్సాహ పర్చింది. 13 రాష్ట్రాల్లో నేడు రెండో దశ పోలింగ్‌తో పాటు రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు రోజు కావడంతో కాస్త నీరసంగానే కదలాడింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో వచ్చిన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు ఏకంగా ఒకటిన్నర శాతం వరకూ పతనం కావడం ఇన్వెస్టర్లను ఒత్తిడికి గురిచేసింది. చివరకు 35 పాయింట్ల నషఅటంతో 11752 దగ్గర నిఫ్టీ ముగిసింది. సెన్సెక్స్ 135 పాయింట్లు కోల్పోగా, బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్లు నీరసించింది. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూస్తే.. 600 స్టాక్స్ లాభపడగా.. సుమారు 1500 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. ఈ లెక్కన ఒక్క స్టాక్ లాభపడితే 2.5 స్టాక్స్ నష్టపోవడం బలహీన ట్రెండ్‌ను స్పష్టంగా సూచిస్తోంది.
సూచీల పరంగా చూస్తే.. ఈ రోజు అన్ని రంగాలూ నష్టాల్లోనే ముగిశాయి. ఎక్కువగా మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. రిలయన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా మోటార్స్, బిపిసిఎల్, విప్రో టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. యెస్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్, హిందాల్కో, వేదాంతా, జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్లు లూజర్స్ జాబితాలో చేరాయి.
రిలయన్స్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్
రిలయన్స్ ఇండస్ట్రీస్.. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత రిజల్ట్స్‌ను ప్రకటించబోతోంది. దేశంలో అత్యధిక మార్కెట్ క్యాపిటలజైషన్ కలిగిన విలువైన సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ సంస్థ ఫలితాల కోసం మార్కెట్ వర్గాలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. రిఫైనింగ్, పెట్రో కెమికల్ బిజినెస్ కాస్త నిరుత్సాహపరిచే సూచనలు కనిపిస్తున్నాయి. జియో సహా రిటైల్ గ్రోత్ ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వచ్చాక సోమవారం రోజున స్టాక్ రియాక్ట్ అయ్యే సూచనలున్నాయి.

ఫైనాన్స్ స్టాక్స్ పతనం
ఈ రోజు ట్రేడ్‌లో ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్ సేవల సంబంధ స్టాక్స్‌లో ఎక్కువగా లాభాల స్వీకరణ నమోదైంది. గత కొంతకాలం నుంచి బ్యాంక్ నిఫ్టీతో పాటు ఈ రంగంలో సంబంధం ఉన్న చాలా స్టాక్స్ పైపైకి దూసుకుపోతూ వచ్చాయి. ఇప్పుడు వాటిల్లో అమ్మకాలు ఒత్తిడి నమోదైంది. యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా సుమారు 4 శాతం నష్టపోతే, ఇండియాబుల్స్ హౌసింగ్, దివాన్ హోసింగ్, రిలయన్స్ క్యాపిటల్, ఐఎఫ్‌సిఐ వంటి స్టాక్స్ ఎక్కువగా నష్టాల బాటలో పయనించాయి. లక్ష్మీవిలాస్ బ్యాంక్, డిసిబి బ్యాంక్ కూడా మూడు శాతం వరకూ కోల్పోయాయి. మెరుగైన ఫలితాలను వెల్లడించినప్పటికీ ఆర్ బి ఎల్ బ్యాంక్ స్టాక్ కూడా 1 శాతం వరకూ నష్టపోయింది.
జెట్ డౌన్- స్పైస్ జెట్ అప్
సేవలను తాత్కాలికంగా నిలిపేసిన నేపధ్యంలో జెట్ ఎయిర్ స్టాక్ ఈ రోజు ఏకంగా 35 శాతం నష్టపోయింది. ఒకే రోజు భారీగా కుప్పకూలింది. ఇంట్రాడేలో రూ.159 స్థాయికి పడిన స్టాక్ చివరకు రూ.165 దగ్గర క్లోజైంది.
ఇదే సమయంలో కాంపిటిటీర్ సంస్థ స్పైస్ జెట్ ఏకంగా ఇంట్రాడేలో 15 శాతం (రూ.152.60) పెరిగింది. అయితే పీక్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావడంతో స్టాక్ 2.5 శాతం లాభాలతో సరిపెట్టుకుని రూ.136 దగ్గర క్లోజైంది.
అడాగ్ స్టాక్స్... నష్టాల బాట
అనిల్ ధీరూభాయ్ అంబానీకి చెందిన గ్రూప్ స్టాక్స్ అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. ప్రధానంగా రిలయన్స్ పవర్ 14 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 14 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రా 8 శాతం, రిలయన్స్ హోం ఫైనాన్స్ 7.5 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 5 శాతం నష్టపోయాయి. ఈ స్థాయిలో స్టాక్స్ పతనానికి కారణం తెలియాల్సి ఉంది.
ప్రాఫిట్ బుకింగ్
గతవారం, ఈ వారం ప్రారంభంలో లాభపడిన మిడ్, స్మాల్, మైక్రో క్యాప్ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ నమోదైంది. ప్రధానంగా దివాన్ హౌసింగ్ 8.5 శాతం, లెమెన్ ట్రీ హోటల్స్ 7 శాతం, ఛాలెట్ హోటల్స్ 6.5 శాతం, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 6 శాతం నష్టపోయాయి. రెయిన్ ఇండస్ట్రీస్, రాడికో ఖైతాన్, లక్ష్మీవిలాస్ బ్యాంక్, గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ స్టాక్స్‌లో నష్టాలు పెరిగాయి.
రేపు సెలవు
శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. మళ్లీ సోమవారం తిరిగి ఎక్స్ఛేంజీలు పనిచేస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications