తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి జెట్ ఎయిర్‌వేస్ బుధవారం రాత్రి నుంచి తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆ సంస్థ షేర్లు రోజు రోజుకు తగ్గాయి. తాజాగా, ఎయిర్వేస్‌ను క్లోజ్ చేయడంతో జెట్ షేర్లు చాలా నష్టపోయాయి. ఏకంగా 32 శాతం పడిపోయాయి.
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జెట్ షేర్లు కుప్పకూలాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఆ సంస్థ షేర్లు 32 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైంది.

నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్‌కు రూ.400 కోట్ల మేర అత్యవసర నిధులు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో జెట్ తన ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. బుధవారం రాత్రి అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి నడుపుతున్న విమానమే ఆఖరిదని సంస్థ ప్రకటించింది. మరోవైపు జెట్‌ను కొనుగోలు చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు వస్తారని రుణదాతలు నేడు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, కొనుగోళ్ల కారణంగా ఇటీవల బాగా పెరిగిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం ఒక్కరోజే రూ.405 తగ్గింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.32,385కు పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయంగా డిమాండ్ తగ్గడంతో బంగారం ధర దిగొచ్చిందని చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో కేజీ వెండి ధర రూ.104 తగ్గి రూ. 38,246గా ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications