తమ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జెట్ ఎయిర్వేస్ బుధవారం ప్రకటించింది. జెట్ గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. నాలుగు నెలలుగా పైలట్లు, ఇంజినీర్లకు కనీసం వేతనాలు కూడా ఇవ్వలేకపోయింది. రూ.1,500 కోట్ల మేర నిధులు... ఇందులో రూ.400 కోట్లు ఎమర్జెన్సీ ఫండ్స్ ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. దీంతో జెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి నడిపిన విమానమే చివరిదని ప్రకటించింది. అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. బ్యాంకులు సహా ఏ ఇతర మార్గాల ద్వారా నిధులు వచ్చే పరిస్థితి లేకపోవడం, ఇంధనం, ఇతర అవసరాలకు నిధులు చెల్లించలేకపోవడం, ప్రత్యామ్నాయాలు పరిశీలించినా ఇప్పటికిప్పుడు నిలదొక్కుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ బాధాకర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

ఇబ్బందుల్లో ఉద్యోగుల భవితవ్యం
జెట్ ఎయిర్వేస్‌కు పాతికేళ్ల చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ సంస్థ తాత్కాలిక మూసివేత వల్ల 22 వేల మందికి పైగా ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఇందులో 16వేల మంది డైరెక్ట్, 6వేల మంది కాంట్రాక్టువల్ ఉద్యోగులు. గత దశాబ్ద కాలంలో దేశీయంగా మూతబడిన పెద్ద విమానయాన సంస్థల్లో జెట్ రెండోది. అయితే ఇది తాత్కాలికమేనని చెబుతున్నారు. కింగ్ ఫిషర్ 2012లో మూతబడింది. జెట్ ఎయిర్వేస్ ఓ సమయంలో రోజుకు 650 విమానాలు నడిపింది. ఇప్పుడు అది టెంపరరీగా క్లోజ్ అయింది.

పెట్టుబడి పెడితే అంతే.. జెట్‌లో విమానాలు మళ్లీ ఎగిరే పరిస్థితి లేదా?
జెట్ ఎయిర్వేస్‌లో 75 శాతం వాటాను విక్రయించేందుకు ఇటీవల ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయి. ఎతిహాద్, టీపీజీ క్యాపిడల్, ఇండిగో భాగస్వాములు, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను అర్హత కలిగిన బిడ్డర్లుగా గుర్తించారని తెలుస్తోంది. మే 10వ తేదీకల్లా వీరిని ఖరారు చేయనున్నారని సమాచారం. జెట్ మూతబడకుండా ఎస్బీఐ ప్రయత్నాలు చేసింది. అయితే లీజుదార్లకు నిధులు చెల్లించకుండా, ఆయిల్ కంపెనీలు, సిబ్బందికి వేతన బకాయిలు తీర్చకపోతే, ఏ పెట్టుబడిదారు అయినా ఎందుకు ముందుకు వస్తారని అంటున్నారు. విమానాలు, పైలట్లు, క్రూ-సిబ్బంది, ఇంజినీర్లు లేకుండా జెట్‌లో ఏం విలువను చూస్తారనే ప్రశ్నిస్తున్నారు. జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ దశను దాటేసిందని, పెట్టుబడులు పెడితే బ్లాక్‌హోల్‌లో పోసినట్లేనని, జెట్ విమానాలు మళ్లీ ఎగిరే పరిస్థితి లేదని జెట్ మాజీ సీఈవో స్టీవ్ ఫోర్ట్ అన్నారు. మరోవైపు, జెట్ పైన తమకు విశ్వాసం ఉందని, విమానాలు ఉన్నంత వరకు సేవలు కొనసాగిస్తామని, సంస్థ మనుగడకు యాజమాన్యం తమకు చేతనైనంత వరకు ప్రయత్నాలు చేసిందని, సంస్థను కాపాడాలని ఢిల్లీలో ప్రదర్శన నిర్వహిస్తామన్నారు.

జెట్‌కు అప్పటి నుంచే కష్టాలు
జెట్ ఎయిర్వేస్ తొలుత బాగానే నడిచింది. పదేళ్ల క్రితం సహారా ఎయిర్ లైన్స్‌ను కొనుగోలు చేసింది. రూ.2050 కోట్లకు తీసుకుంది. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ఈ కొనుగోలు జెట్‌ను అప్పుల్లో ముంచిందని అంటున్నారు. మరోవైపు, దేశీయ విమాన సర్వీసులకు ఉపయోగించే ఇంధనంపై అధిక పన్నుల పోటు, విమానాశ్రయాల్లో ఇన్ ఫ్రా సమస్యలతో మరిన్ని విమానాలను చేర్చే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన పోటీ కారణంగా చౌక చార్జీలతో కొనసాగాల్సి వస్తుండటం, నష్టాల్లో ఉన్న సంస్థలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు.
జెట్ పునరుద్ధరణకు తాము సహకరించామని, విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు సామర్థ్యం పెంచుకునేందుకు తోడ్పడుతున్నామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత రెగ్యులేటరీ నిబంధనలకు లోబటి మాత్రమే రుణ పరిష్కార ప్రక్రియకు సాయం చేస్తామని తెలిపింది. ఇతర విమానాల్లో ఛార్జీలు పెరగకుండా కూడా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. కాగా, ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం బిడ్స్‌ను ఆహ్వానించినందున, మే 10వ తేదీ వరకు గడువు ఉన్నందున అప్పటి దాకా నిరీక్షిస్తే ఏమైనా తేలుతుందని భావిస్తున్నారు.

రెండో అతిపెద్ద, మొత్తంగా ఏడో విమానయాన సంస్థ
గత ఏడేళ్లలో మూతబడిన (తాత్కాలికం) పెద్ద విమానయాన సంస్థల్లో కింగ్ ఫిషర్ (2012లో క్లోజ్) తర్వాత జెట్ రెండోది. అయిదేళ్లలో మూతబడిన అన్ని విమానయాన సంస్థల లెక్క తీస్తే జెట్ ఏడోది. ఎయిర్ పెగాసస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, ఎయిర్ డెక్కన్, ఎయిర్ ఒడిశా, జూమ్ ఎయిర్‌లు కూడా మూతబడ్డాయి.1987లో వాయుదూత్, 1996లో ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్, 1997లో దమానియా ఎయిర్వేస్, 2000లో అర్చనా ఎయిర్వేస్ మూతబడ్డాయి.

ఇది జెట్ చరిత్ర
జెట్ ఎయిర్వేస్ 1992లో ఏర్పాటయింది. 1993లో ఎయిర్ ట్యాక్సీ ఆపరేటర్ కార్యకలాపాలు ప్రారంభించింది. 1995లో పూర్తి స్థాయి విమానయాన సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించింది. 2004లో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్ ప్రారంభించింది. 2005లో పబ్లిక్ ఇష్యూ(ఐపీఓ)కి వచ్చింది. 2007లో రూ.2,050 కోట్లతో ఎయిర్ సహారా కొనుగోలు చేసింది. 2010-2012 దాకా పాసింజర్ మార్కెట్లో అత్యధిక వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 2011-12లో సంక్షోభ పరిస్థితులు కనిపించాయి. 2013లో ఎతిహాద్‌కు 24 శాతం వాటాలను విక్రయించింది. డీల్ విలువ 379 మిలియన్ డాలర్లు. గడిచిన పదేళ్లలో ఎనిమిదేళ్ల నష్టాలను చవి చూసింది. 2015లో 22.5 శాతంగా ఉన్న మార్కెట్ వాటా 2018 నాటికి 15.5 శాతానికి పడిపోయింది. గత ఏడాది మార్చిలో మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం, టాప్ మేనేజ్మెంట్ జీతల కట్ వరకు వెళ్లింది. గత ఏడాదికాలంలో 60 శాతంకు పైగా హరించుకుపోయింది. బ్యాంకర్లకు, ఇతర రుణదాతలకు రూ.8వేల కోట్లకు పైగా బాకీపడింది. దీంతో ఇటీవల వందకు పైగా విమానాలు నడిచాయి. బుధవారానికి పూర్తిగా (తాత్కాలికంగా) ఆపరేషన్స్ క్లోజ్ చేసింది. కొద్ది రోజుల క్రితం నరేష్ గోయల్ తప్పుకున్నారు. బ్యాంకు యాజమాన్యాలు కంపెనీని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. 75 సాతం వాటాలు విక్రయించేందుకు బిడ్స్‌ను ఆహ్వానించాయి. ఇదే సమయంలో సంస్థకు రూ.1500 సమకూర్చే ప్రతిపాదనలు వచ్చాయి. కానీ జెట్ పరిస్థితి చూసి బ్యాంకర్లు వెనక్కి తగ్గాయి. బిడ్స్ గడువు మే 10వ తేదీ వరకు ఉన్న సమయంలో.. ఇరవై రెండు రోజుల ముందు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపేసింది. మే 10న ఏం జరుగుతుందనేది తెలియనుంది. జెట్ ఎయిర్వేస్‌లో కొద్ది కాలం క్రితం 119కి పైగా విమానాలుండేవి. కానీ అద్దెలు కట్టకపోవడంతో లీజుకు ఇచ్చిన సంస్థలు పలు విమానాలను నిలిపేశాయి. దీంతో రెండు రోజుల క్రితం సంఖ్య 5కి పడిపోయింది. ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయి. బుధవారం తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications