ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసింది. ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ లైసెన్స్ కోసం రిలయన్స్ జియో టెలికాం డిపార్టుమెంటుకు దరఖాస్తు చేసుకుంది. అనుమతి లభిస్తే ఇండియన్ మరియు ఫారెన్ ఎయిర్ లైన్స్‌లలో కనెక్టివిటీ, డేటా సర్వీస్‌లు లభిస్తాయి. డిపార్టుమెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌కు (డీఓటీ) జియో మాత్రమే కాకుండా ఆర్టస్ కమ్యూనికేషన్స్, స్టేషన్ స్టాట్‌కమ్, క్లౌడ్ కాస్ట్ డిజిటల్ వంటివి కూడా దరఖాస్తు చేశాయి. దరఖాస్తుపై స్పందించేందుకు రిలయన్స్ జియో నిరాకరించింది.
ఇన్-ఫ్లైట్, మరియు మెరైనాలో మొబైల్ ఫోన్ సర్వీసుల కోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలలో రూల్స్‌ను నోటిఫై చేసింది. అప్పటి నుంచి భారతీ ఎయిర్‌టెల్, హ్యూజ్స్ కమ్యూనికేషన్స్ ఇండియా, టాటానెట్ సర్వీసెస్‌లు ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో హ్యూజ్స్ కమ్యూనికేషన్స్ ఇండియాకు (హెచ్‌సీఐఎల్) తొలిగా అనుమతులు లభించాయి. ఆ తర్వాత టాటానెట్ సర్వీసెస్, నెల్కోలకు అనుమతులు వచ్చాయి. ఇటీవలే భారతీ ఎయిర్‌టెల్‌కు డీవోటీ (టెలీ కమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్) అనుమతులు ఇచ్చింది. యూరోకన్సల్ట్ ప్రకారం 2027 సంవత్సరం నాటికి 23,000 కమర్షియల్ విమానాల్లో కనెక్టివిటీ ఉంటుంది. 2017 నాటికి ఇది 7,400గా ఉంది.
ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ లైసెన్స్ ద్వారా టెలికాం కంపెనీలు దేశీయ, విదేశీ ఎయిర్ లైన్స్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నవారికి మొబైల్ కాలింగ్, డేటా కనెక్టివిటీ సేవలు అందించవచ్చు.


Click it and Unblock the Notifications