స్టాక్ మార్కెట్ సూచీలు మరో రికార్డ్ క్లోజింగ్ నమోదు చేశాయి. నిఫ్టీ మొట్టమొదటిసారి 11800 పాయింట్ల మార్కును అధిగమించింది. సెన్సెక్స్‌లో కూడా అదే జోరు నమోదైంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు లభించిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో నిఫ్టీ పరుగు పెట్టింది. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ హెవీ వెయింట్ స్టాక్ కావడంతో అందులో వచ్చిన లాభాలు నిఫఅటీని బాగా పైకి తీసుకెళ్లాయి. ఆ తర్వాత హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, రిలయన్స్ కూడా మార్కెట్లకు మద్దతునిచ్చాయి. చివరకు 97 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11787 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 370 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 430 పాయింట్లు పెరిగి ఆశ్చర్యపరిచాయి.
మిడ్, స్మాల్ క్యాప్స్ ఊసే లేదు
నిఫ్టీ సుమారు 100 పాయింట్లు లాభపడినప్పటికీ చాలా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో మాత్రం పెద్దగా యాక్టివిటీ లేదు. కనీసం ఈ రెండు ఇండెక్సులూ 0.10 శాతం లాభాలను కూడా నమోదు చేయలేదు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిఫఅటీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 50 నష్టాల్లో ముగిసింది.
వీటికి తోడు ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్, రియాల్టీ రంగ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఇవి కాకుండా బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్ స్టాక్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. విప్రో, సిప్లా, గెయిల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్ స్టాక్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

విమాన కంపెనీల మోత
జెట్ ఎయిర్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపధ్యంలో ఈ స్టాక్ మరింత పతనమైంది. ఇంట్రాడేలో స్టాక్ ఏకంగా 13 శాతం వరకూ పడిపోయింది. చివరకు 8 శాతం నష్టాలతో రూ.240 దగ్గర క్లోజైంది.
ఇవి ప్రత్యక్షంగా తమ సంస్థలకు లాభం చేకూరుస్తుంది కాబట్టి ఇండిగో స్టాక్ 8 శాతం రూ.1583 దగ్గర ముగిసింది. స్పైస్ జెట్ స్టాక్ 11.19 శాతం లాభపడి రూ.132.70 దగ్గర ముగిసింది. వాల్యూమ్స్ కూడా అనూహ్యంగా పెరిగాయి స్పైస్ జెట్‌లో.
బంధన్‌లో గృహ విలీనానికి ఆమోదం
ప్రముఖ స్మాల్ బ్యాంక్ బంధన్‌లో .. హౌసింగ్ లోన్ సంస్థ గృహ్ ఫైనాన్స్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ) ఆమోదం తెలిపింది. దీంతో ఈ స్టాక్స్‌లో కొద్దిగా యాక్టివిటీ నమోదైంది. బంధన్ ఏకంగా 5 శాతం లాభాలతో రూ.558 దగ్గర క్లోజ్ అయితే, గృహ్ మాత్రం ఫ్లాట్‌గా రూ.283 వద్ద స్థిరపడింది.
పాలీక్యాబ్ పటిష్ట లిస్టింగ్
వైర్స్, కేబుల్స్ తయారీ సంస్థ పాలీక్యాబ్ ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. రూ.538 ఇష్యూ ధరతో వచ్చిన ఈ ఐపీఐ ఈ రోజు ఏకంగా 20 శాతం ప్రీమియంతో రూ.644.45 దగ్గర లిస్ట్ అయింది. ఆ తర్వాత కూడా చివరి వరకూ అదే పట్టును కొనసాగించింది. చివర్లో మరింత లాభపడి రూ.654.80 దగ్గర క్లోజైంది.
పిసి జ్యూవెలర్స్ .. మరింత షైన్
జ్యువెల్రీ సంస్థ పిసి జ్యువెలర్స్ స్టాక్ మరింత పైపైకి దూసుకుపోతూనే ఉంది. కార్లినా అనే ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సుమారు 1.2 శాతం వాటా కొనుగోలు చేసిందనే వార్తలు ఈ స్టాక్‌లో మరింత జోష్ పెంచాయి. ఈ రోజు కూడా సుమారు 4.3 లక్షల షేర్లు బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారయి. దీంతో 16 శాతం లాభాలతో రూ.146 దగ్గర స్టాక్ క్లోజైంది.
మళ్లీ రిలయన్స్ క్యాపిటల్ డౌన్
అనిల్ అంబానీకి చెందిన సంస్థ రిలయన్స్ క్యాపిటల్‌లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఈ రోజు ఈ స్టాక్‌లో ఏకంగా 6 శాతం పతనం నమోదైంది. పతనానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్టాక్ మాత్రం 7.25 శాతం నష్టంతో రూ.171 దగ్గర ముగిసింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications