For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కనెక్టింగ్ రైళ్లలో ప్రయాణిస్తే మీకో గుడ్‌న్యూస్! మీ జర్నీ సులభం.. రీఫండ్ ఈజీ

|

ఇండియన్ రైల్వే కనెక్టింగ్ రైలు ప్రయాణాన్ని సులభతరం చేసింది. నేరుగా తాము ప్రయాణం చేయాల్సిన చోటుకు రైళ్లు ఉండకపోవచ్చు. అప్పుడు ప్రయాణీకులు మెయిన్ ట్రైన్, ఆ తర్వాత కనెక్టింగ్ ట్రైన్‌కు టిక్కెట్ తీసుకుంటారు. అంటే ఒకటి కంటే ఎక్కువ రైళ్లలో ప్రయాణించి గమ్యస్థానం చేరుకుంటారు. కనెక్టింగ్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇటీవలే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శుభవార్త అందించారు. కనెక్టింగ్ ప్రయాణం ఉంటే పీఎన్ఆర్‌లను లింక్ చేస్తున్నారు.

 పీఎన్ఆర్ లింకింగ్

పీఎన్ఆర్ లింకింగ్

ప్రయాణీకుల రెండు రైళ్లకు చెందిన పీఎన్ఆర్ నెంబర్లను లింక్ చేస్తారు. ఇది వరకు కనెక్టింగ్ రైలు మిస్ అయితే టైమ్ బాగోలేదని బాధపడి ఊరుకునేవారు. ప్రత్యామ్నాయం చూసుకునేవారు. కానీ రెండు పీఎన్ఆర్ నెంబర్లను కనెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త అందించింది. మొదటి రైలు ఆలస్యం కారణంగా కనెక్టింగ్ రైలు (రెండో రైలు) దొరకకపోతే మీ డబ్బులు వాపస్ చేస్తారు. కనెక్టింగ్ రైళ్లలో ప్రయాణించేవారు ఇదివరకు డబ్బులు రీఫండ్ చేసుకునే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొదటి ట్రైన్ ఆలస్యం వల్ల ప్రయాణీకుడికి రెండో ట్రైన్ దొరకకపోయినా రీఫండ్ విషయంలో ఇక్కట్లు పడేవారు. ఇప్పుడు గోయల్ ఆధ్వర్యంలోని రైల్వే శాఖ మార్పులు చేసింది. ఇది ప్రయాణీకులకు గుడ్ న్యూస్.

ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభమైంది

ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రారంభమైంది

కనెక్టింగ్ ట్రైన్‌లకు సంబంధించిన పీఎన్ఆర్ నెంబర్స్ లింకింగ్ ఏప్రిల్ 1వ తేదీ (2019) నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు ప్రయాణీకులు తమ రెండో ట్రెయిన్ బుక్ చేసుకునే సమయంలో మొదటి మరియు రెండో ట్రెయిన్ పీఎన్ఆర్ నెంబర్లను లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. రిజర్వేషన్ ద్వారా ప్రయాణించినా, రిజర్వేషన్ లేకుండా ప్రయాణించినా.. మొదటి రైలు ఆలస్యం కారణంగా రెండో రైలు మిస్ అయితే మీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. రెండు పీఎన్ఆర్ నెంబర్లను లింక్ చేసుకోవడం వల్ల ఇది ఇప్పుడు ఎంతో సులభంగా మారింది. అయితే ప్రయాణీకులు తమ టిక్కెట్, వివరాలను మూడు గంటలలోపు ఇస్తే క్యాన్సిలేషన్ రద్దయి రీఫండ్ చేస్తారు. అదే జంక్షన్‌లో ఫండ్ తిరిగిస్తారు. రైల్వే కౌంటర్ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా ఎక్కడ బుక్ చేసుకున్నా ఈ సౌలభ్యం ఉంటుంది. ఇకపోతే మనం ఆలస్యంగా వెళ్లి కనెక్టింగ్ ట్రైన్ మిస్సయితే రిఫండ్ ఉండదు.

రీఫండ్ కావాలంటే.. ఇవి తప్పనిసరి

రీఫండ్ కావాలంటే.. ఇవి తప్పనిసరి

కనెక్టింగ్ రైళ్లలో మీ డబ్బులు రీఫండ్ కావాలంటే రెండు పీఎన్ఆర్‌లలోను మీ పేర్లు ఒకేవిధంగా ఉండాలి. ఈ రీఫండ్ అన్ని క్లాస్‌లకు వర్తిస్తుంది. మొదటి రైలు టెర్మినేటింగ్ స్టేషన్ మరియు కనెక్టింగ్ (రెండవది) ట్రెయిన్ ఒరిజినేటింగ్ స్టేషన్‌ను పరిగణలోకి తీసుకుంటారు. మెయిన్ ట్రెయిన్‌లో మీరు దిగే స్టేషన్, అలాగే, రెండో ట్రెయిన్‌లో మీరు ఎక్కగోరుతున్న స్టేషన్ ఒకటే అయి ఉండాలి.

అదే స్టేషన్‌లో మీకు కౌంటర్ అందుబాటులో లేకుంటే లేదా అసాధారణ సందర్భాల్లో మాత్రమే టీడీఆర్ (టిక్కెట్ డిపాజిట్ రిసిప్ట్) ను మూడు రోజుల కాలపరిమితితో జారీ చేస్తారు. పీఆర్ఎస్ (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అయితే చేంజ్ ఓవర్ స్టేషన్‌లో 3 గంటల వరకు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సీసీఎం లేదా రీఫండ్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే డబ్బు మొత్తం రీఫండ్ చేస్తారు. ఐఆర్‌సీటీసీ ఈ-టిక్కెట్క్స్ అయితే టీడీఆర్ ఫైల్ చేసిన 3 గంటల్లోపు మొత్తాన్ని రీఫండ్ చేస్తారు. మెయిన్ ట్రైన్ ఆలస్యం కారణంగా రెండో ట్రైన్ అందుకోలేని కారణంగా దీనిని ఫైల్ చేస్తే రీఫండ్ చేస్తారు.

Read more about: irctc indian railways refund
English summary

కనెక్టింగ్ రైళ్లలో ప్రయాణిస్తే మీకో గుడ్‌న్యూస్! మీ జర్నీ సులభం.. రీఫండ్ ఈజీ | IRCTC PNR linking, Claiming refund for connecting Indian Railways journeys gets easier: here’s how

Claiming refunds for connecting journeys now gets easier! Missed the second train for a connecting Indian Railways train journey due to the late arrival of the first train? There is good news for you. In a bid to improve the experience of connecting train journeys, Piyush Goyal-led Indian Railways has recently introduced the concept of linking PNRs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X