చండీగఢ్: బాటా ఇండియా లిమిటెడ్‌కు షాక్. రూ.3 పేపర్ బ్యాగ్ కోసం రూ.9,000 జరిమానా కట్టవలసి వచ్చింది. ఈ సంఘటన పంజాబ్‌లోని చండీగఢ్‌లో చోటు చేసుకుంది. క్యారీ బ్యాగ్‌కు బలవంతంగా మూడు రూపాయలు వసూలు చేసినందుకు వినియోగదారుల ఫోరం సంఘం.. బాటా కంపెనీకి రూ.9,000 ఫైన్ వేసింది.

క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేసిన బాటా షోరూం
చండీగఢ్‌కు చెందిన దినేష్ ప్రసాద్ రాటూరీ గత ఫిబ్రవరి అయిదో తేదీన సెక్టార్ 22డీలోని బాటా షోరూంలో బూట్లు కొనుగోలు చేశారు. మేనేజ్‌మెంట్ అతని వద్ద రూ.402 వసూలు చేసింది. ఇందులో బూట్లతో పాటు దినేష్ ప్రసాద్‌కు ఇచ్చిన పేపర్ బ్యాగ్‌కు రూ.3 ఛార్జ్ వసూలు చేసింది. దీనిపై అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్‌పై వేసిన రూ.3 తగ్గించాలని కోరాడు. కానీ బాటా షోరూం వారు పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. బాటా కంపెనీకి కవర్‌కు రూ.3 ఛార్జ్ వసూలు చేయడంతో పాటు ఆ బ్యాగ్ పైన బాటా బ్రాండ్‌ను ప్రమోషం చేసుకుందని, ఇది సరికాదని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.

పరిహారం ఇవ్వాలని వినియోగదారుల ఫోరం ఆదేశం
దీంతో వినియోగదారుల ఫోరం.. బాటాకు జరిమానా విధించింది. దినేష్ ప్రసాద్‌కు రూ.3 తిరిగి ఇవ్వడంతో పాటు, సేవలలో లోపానికి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, సేవలలో లోపాన్ని బాటా కంపెనీ అంగీకరించలేదు. అయితే బలవతంగా పేపర్ బ్యాగ్‌కు రూ.3 ఛార్జ్ చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. ఎవరైనా కస్టమర్లు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు.

వ్యాజ్యంకు రూ.1000, మానసిక ఆందోళకు రూ.3,000, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5వేలు
దినేశ్ ప్రసాద్‌కు పేపర్ బ్యాగ్ ధర రూ.3తోపాటు వ్యాజ్యం ఖర్చు రూ.1000 చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అంతేకాకుండా వినియోగదారుడిని మానసిక ఆందోళనకు గురిచేసినందుకు రూ.3000 పరిహారం, లీగల్ ఎయిడ్ నిధికి రూ.5000 చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్ అందజేయాలని ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలకు నిజంగా పర్యావరణ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే పర్యావరణ రహిత బ్యాగ్‌లను సరఫరా చేయాలని తెలిపింది. కాగా, వినియోగదారుల ఫోరం బాటాకు వేసిన జరిమానా... ఇతర స్టోర్‌లకు హెచ్చరిక. ఎందుకంటే చాలా స్టోర్‌లు కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్‌లకు బలవంతంగా రూ.3 నుంచి రూ.5, కొన్నిచోట్ల రూ.7 వసూలు చేస్తారు.


Click it and Unblock the Notifications