టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కొత్త సంస్థల కొనుగోళ్ల పట్ల ఆసక్తితో ఉంది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గణపతి సుబ్రహ్మణ్యమ్ వెల్లడించారు. టీసీఎస్ కొద్ది రోజుల క్రితం డబ్ల్యూ12, బ్రిడ్జ్ పాయింట్ గ్రూప్‌లను కొనుగోలు చేసింది. కొత్త మేధో సంపత్తి ద్వారా మార్కెట్‌ను విస్తరించాలని టీసీఎస్ భావిస్తోంది. ఈ సందర్భంగా ఎంటీటీస్‌ను కొనుగోలు చేసిన విషయం వెల్లడించారు.
తాము కొనుగోలు చేసేందుకు ఎప్పుడు సిద్ధమేనని, తమకు కొనుగోళ్లు లేదా ఆయా కంపెనీలను విలీనం చేసుకోవడంలో మంచి రికార్డ్ ఉందని, తమ సంస్థకు సరైన మేధో సంపత్తి తీసుకురాగల సంస్థ కోసం తాము మార్కెట్లో అన్వేషణ కొనసాగిస్తామని, స్టార్టప్‌లు చాలా బాగా పని చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా బ్లాక్ చెయిన్ విభాగాంలో పలు కొత్త సంస్థలు పుట్టుకు వచ్చాయని, ఫైనాన్షియల్ విభాగాల్లో ఇవి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. స్టార్టప్‌ల్లో కొనుగోళ్లకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు.

టీసీఎస్ 2013లో శాప్ సేవలు అందించే అల్టీ ఎస్ఏను రూ.533 కోట్లకు కొనుగోలు చేసింది. విప్రో డిసిగ్నేట్ అండ్ కూపర్‌లో పెట్టుబడి పెట్టింది. కన్స్యూమర్ ఇన్‌సైట్స్ ఏజెన్సీ వాంగ్‌డూడీని 75 అమెరికన్ మిలియన్ అమెరికన్ డాలర్లకు గత ఏడాది అక్వైర్ చేసుకుంది. గత ఏడాది నవంబర్ నెలలో డబ్ల్యు 12 స్టూడియోస్‌ను కొనుగోలు చేసింది. కానీ దీనిని ఎంతకు కొనుగోలు చేసిందో తెలియరాలేదు. అదే నెలలో బ్రిడ్జ్ పాయింట్ గ్రూప్‌ను కొనుగోలు చేసింది. టీసీఎస్ ఆర్గానిక్ గ్రోత్‌పై దృష్టి సారించింది.
కాగా, టీసీఎస్ క్వార్టర్ 4 ఫలితాల్లో 17.7 శాతం పెరుగుదల చూపించిన విషయం తెలిసిందే. నికర లాభం రూ.8,126 కోట్లుగా నమోదు చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన అనంతరం విడుదల చేసిన క్యూ4 ఫలితాల్లో 17.7 శాతం పెరుగుదల చూపించింది. గత సంవత్సరం క్యూ4లో నికరలాభం రూ.6,904 కోట్ల వద్ద నిలిస్తే ఈ సంవత్సరం మాత్రం 1,200 కోట్లు అధికంగా నమోదయింది. టీసీఎస్ రెవెన్యూ కూడా రూ.38,010 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ.32,075 కోట్లుగా ఉంది. గడిచిన పదిహేను క్వార్టర్లతో పోల్చితే ఈ క్వార్టర్ చాలా బలమైన ఫలితాలు ఇచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications