హైదరాబాద్ : ప్రముఖ సోషల్‌మీడియా సంస్థ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ గత కొన్నేళ్లుగా ఏడాదికి కేవలం ఒకే డాలరు జీతం మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఆయన భద్రత కోసం ఫేస్‌బుక్ భారీగా వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్ దాదాపు 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందట.
అంటే భారత కరెన్సీలో దాదాపు 138 కోట్ల రూపాయల పైమాటే. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. కాగా.. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికం. గత మూడేళ్లుగా జుకర్‌బర్గ్ మూలవేతనం అక్షరాలా 1 డాలరుగా ఉంది. అయితే ఇతర సదుపాయాల కింద గతేడాది 22.6మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు కంపెనీ తెలిపింది.

ఇందులో 90శాతం జుకర్, ఆయన కుటుంబం భద్రత కోసమే ఖర్చు చేసినట్లు పేర్కొంది. జుకర్ భద్రత కోసం 2018లో దాదాపు 20 మిలియన్ డాలర్లు వెచ్చించింది. మిగతా 2.6 మిలియన్ డాలర్లు జుకర్ వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేసింది. అయితే 2017తో పోలిస్తే ఇది రెండు రెట్లు ఎక్కువ.
కొన్ని ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో సోషల్‌మీడియా సంస్థలు తమ సీఈవోల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ భద్రత కోసం ఫేస్‌బుక్ భారీగా ఖర్చు చేస్తోంది. ఇక ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ వేతనం మాత్రం కాస్త తగ్గింది. 2017లో ఆమె 25.2 మిలియన్ డాలర్ల జీతం అందుకోగా.. 2018లో అది 23.7మిలియన్ డాలర్లుగా ఉంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications