జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో మరో కొత్త ట్విస్ట్. రుణాలు ఇచ్చిన బ్యాంకర్ల కన్సార్టియం ఆయన పదవి నుంచి బోర్డు నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే తాజాగా కొత్త అంశం వెలుగు చూస్తోంది. గత నెలలో చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న గోయల్ ఎయిర్ లైన్స్‌లో వాటాను తిరిగి దక్కించుకోవాలని యోచిస్తున్నారట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.
జెట్ ఎయిర్వేస్‌లో వాటాల కొనుగోలుకు ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరూ ఆశక్తి చూపించడం లేదు. దీంతో నిర్దిష్టమైన రోడ్ మ్యాప్‌తో ఆయన సిద్ధమవుతున్నారట. త్వరలో ఆయన బిడ్ దాఖలు చేయనున్నారని అంటున్నారు. ఎస్బీఐ నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియం రుణ పరిష్కార ప్రణాళికను వేగవంతం చేసింది.

ఇందులో భాగంగా జెట్ ఎయిర్వెస్‌లో దాదాపు 75 శాతం వాటాను విక్రయించేందుకు బిడ్స్ ఆహ్వానించారు. దీనికి పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు డెడ్‌లైన్ పొడిగించింది. బడ్స్ సమర్పించే గడువును ఏప్రిల్ 12 వరకు పొడిగిస్తున్నట్టు ఎస్బీఐ క్యాపిటల్ ప్రకటించింది.
దీంతో జెట్ ఎయిర్వేస్‌లో ఇప్పటికే పెట్టుబడిదారుగా ఉన్నఎతిహాడ్, జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్ కూడా జెట్ వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. నరేష్ గోయల్ కూడా బిడ్స్ సమర్పించే అవకాశముందని చెబుతున్నారు. కావాలనుకుంటే ఎయిర్ లైన్స్ ప్రమోటర్స్ కూడా బిడ్‌లో పాల్గొనవచ్చునని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.
అయితే ఇప్పటికే పలువురు బిడ్లు కూడా సమర్పించారని తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications