వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ నేపధ్యంలో స్టాక్ మార్కెట్లలో కూడా పెద్దగా యాక్టివిటీ లేదు. ఉదయం నుంచి స్థబ్దుగానే సాగిన ట్రేడింగ్ చివరకు ఫ్లాట్‌గానే ముగిసింది. రేపు వెలువడబోతున్న టిసిఎస్, ఇన్ఫోసిస్ నేపధ్యంలో ట్రేడర్లు ఆచితూచి స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా పెద్దగా సంకేతాలేవీ లేకపోవడంతో ఆద్యంతం రేంజ్ బౌండ్ ట్రేడ్ కొనసాగింది. చివరకు సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో 38607 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 11596 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 18 పాయింట్లు కోల్పోయి 29786 వద్ద పరుగు ఆపింది.
మెటల్స్, రియాల్టీ, ఐటీ రంగ కౌంటర్లలో అత్యధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఆటో, ఎఫ్ఎంసిజి, మీడియా రంగ కౌంటర్లలో కొద్దిగా బయింగ్ నమోదైంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా నీరసంగానే ముగిశాయి.

ఐబీ హౌసింగ్, బజాజ్ ఫిన్ సర్వ్, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. వేదాంతా, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
పివిఆర్ .. సూపర్ హిట్
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పివిఆర్ సినిమాస్ వరుసగా రెండో రోజు కూడా లైఫ్ టైం హై మార్కును క్రాస్ చేసి పరుగు పెడ్తోంది. ఈ రోజు మరో ఆల్ టైం హై స్థాయిని తాకిన పివిఆర్.. చివరకు 0.93 శాతం లాభంతో రూ.1712 దగ్గర క్లోజైంది. ఇదే బాటలో సీమెన్స్ సంస్థ కూడా వరుసగా మూడో రోజు కూడా లాభాల్లో ముగిసింది. వాల్యూమ్స్‌తో సహా స్టాక్ పెరిగింది. స్టాక్ 13 నెలల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 0.35 శాతం లాభంతో రూ.1170 దగ్గర ముగిసింది.
రైల్ వికాస్ నిగం లిస్టింగ్
కేంద్ర సంస్థ రైల్ వికాస్ నిగం లిమిటెడ్ షేర్ ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. రూ.19 దగ్గర ఈ స్టాక్ లిస్ట్ అయింది. ఆ తర్వాత 18.60 స్థాయికి దిగొచ్చింది. చివరకు 0.26 శాతం లాభంతో రూ.19.05 దగ్గర క్లోజైంది.
బ్రెంట్ నీరసం.. ఆయిల్ కంపెనీలకు ఉత్సాహం
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ కాస్త కూల్ అయింది. వరుసగా పెరిగిన క్రూడ్ ఈ రోజు బ్రేక్ తీసుకోవడంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కాస్త పెరిగాయి. బిపిసిఎల్, హెచ్ పి సి ఎల్ షేర్లు 1.5 శాతం వరకూ పెరిగితే, ఇండియన్ ఆయిల్ కార్ప్ 0.75 శాతం పెరిగింది.
స్మాల్ క్యాప్ షేకర్స్
స్మాల్ క్యాప్ స్పేస్‌లో వక్రంజీ ఏకంగా 20 శాతం వరకూ పెరిగింది. గత కొద్ది రోజుల నుంచి యాక్టివ్‌గా ట్రేడవుతూ వస్తున్న స్టాక్ ఈ రోజు మరింత జోరు కనబర్చింది. చివరకు 15.76 శాతం లాభాలతో రూ.65.75 దగ్గర క్లోజైంది. మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించవచ్చనే అంచనాలతో స్టాక్ పెరిగి ఉండొచ్చు. ఈ మధ్యబాగా పతనమైన శంకర్ బిల్డ్ కాన్ 10 శాతం వరకూ పెరిగింది. స్పైస్ జెట్, ప్రతాప్ స్నాక్స్, వండర్‌లా, రాంకీ ఇన్ఫ్రా స్టాక్స్ 5 శాతానికిపైగా లాభాలతో ముగిశాయి.
ప్రాఫిట్ బుకింగ్
ఈ మధ్య కొద్దిగా పెరిగిన స్టాక్స్‌లో లాభాల స్వీకరణ నమోదైంది. వాటిల్లో వేదాంతా 4 శాతం తగ్గితే, డిమార్ట్ 3 శాతం వరకూ పడిపోయింది. జెకె బ్యాంక్, మ్యూజిక్ బ్రాడ్‌కాస్ట్, మాస్ ఫైనాన్షియల్, ఈస్ట్ ఇండియా హోటల్స్ వంటి స్టాక్స్‌లో 3 శాతానికి పైగా నష్టం నమోదైంది.
More From GoodReturns

రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు.. బ్యాంకులు కూడా పనిచేయవు.. ఈ రోజు పతనానికి విలవిలలాడుతున్న ఇన్వెస్టర్లు..

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్.. నిన్న లాభాలన్నీ ఆవిరి..పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications