అమెరికాలోని కనెక్టికట్‌లో తీగలాగితే హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా ఆఫీసుల్లో డొంక కదిలేట్టుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని ఓ అతిద్ద కేస్‌లో రెండు తెలుగు కంపెనీలు సహా మొత్తం 18 జెనిరిక్ ఔషధ సంస్థలు ఇరుక్కున్నాయి. అమెరికా దేశ చరిత్రలో ఓ అతిపెద్ద కార్టెలజైషన్ కేస్‌లో భారత్‌కు చెందిన ఐదు కంపెనీలతో పాటు వివిధ దేశాలకు చెందిన సంస్థల పేర్లు బయటకు వచ్చాయి.
కనెక్టికట్‌కు చెందిన మల్టీ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓ యాంటీ ట్రస్ట్ లా సూట్‌పై దాఖలైన కేసులో విచారణ చేస్తున్నప్పుడు కొన్ని ఇనిషియల్స్, కొంత మంది వ్యక్తులకు సంబంధించిన హోదాలు, ఇండస్ట్రీ కోడ్ భాషతో ఉన్న పదాలు, ఈ-మెయిల్ ఆధారాలను కొనుగొన్నారు పోలీసులు. ఆ దేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడంతో పాటు నమ్మక ద్రోహానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఇంతకీ ఏంటా కేస్
అమెరికాకు వివిధ దేశాల నుంచి జెనిరిక్ ఔషధాలు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రపంచంలోని వివిధ ఫార్మా కంపెనీలన్నింటికీ అమెరికా దేశమే అతిపెద్ద మార్కెట్. అందుకే కొన్ని కంపెనీలు అంతర్గతంగా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ఓ ఒప్పందానికి వచ్చి ప్రైస్ రిగ్గింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఔషధానికి కూడా అధిక ధరను కోట్ చేసి లాభాలను పెంచుకోవడమే వీళ్ల పనిగా ఉన్నట్టు ఆ దేశ అధికారులు గుర్తించారు. ఈ నేపధ్యంలో ఈ సంస్థలపై అనేక వ్యాజ్యాలు కూడా అమెరికన్ కోర్టుల్లో దాఖలయ్యాయి. గతంలో ట్రంప్ కూడా దేశ ఫార్మా కంపెనీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ ఈ స్థాయిలో ధరలను పెంచడం సరికాదని, వీళ్ల లాభాలకు ఎలా అయినా గండికొట్టాల్సిందేనని ట్రంప్ గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు.
ఇప్పుడీ వ్యవహారంలో అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎంక్యూర్, గ్లెన్‌మార్క్, జైడస్, అపోటెక్స్, తెవా, హెరిటేజ్ ఫార్మా, పార్ ఫార్మా వంటి కంపెనీల పేర్లు మరోసారి బయటకు వచ్చాయి.
ఇప్పుడేం జరిగింది
ఈ దర్యాప్తులో భాగంగా అక్కడి అధికారులు కొన్ని ఈమెయిళ్లను శోధించగా కొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. నేరుగా పేరు లేకపోయినప్పటికీ ఆ యా కంపెనీల్లో హోదాలు మాత్రం దర్యాప్తులో తెలిశాయి. ఉదాహరణకు సన్ ఫార్మా సీనియర్ సేల్స్ మేనేజర్ అని, సన్ ఫార్మా ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్‌లో వైస్ ప్రెసిడెంట్ - సేల్స్ అని హోదాలతో సహా ఆధారాలు బయటకు పొక్కాయి. వీళ్లంతా కుట్రలో భాగస్వాములయ్యారని అర్థమవుతోందని తేలింది. కోడ్ భాషలు వాడడం, కాంపిటీటర్స్ అంతా ఒక్కటైపోవడం వంటివన్నీ స్పష్టంగా ఓ కుట్రను అద్దంపడ్తున్నాయని కనెక్టికట్ అటార్నీ జర్నల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఎలిజిబెత్ బెంటన్ వెల్లడించారు.
ఇది చాలా ఏళ్లుగా నానుతూనే ఉన్న కేస్ అయినప్పటికీ తాజాగా వివిధ ప్రముఖ సంస్థల ఉన్నతోద్యోగులపేర్లు బహిర్గతం కలవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒక వేళ ఈ దర్యాప్తులో భాగంగా వివిధ జెనిరిక్ కంపెనీలు ఒక్కటయ్యారని తేలితే అమెరికా కోర్టులు కఠిన శిక్షలతో పాటు భారీ పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉంది. మరి దీన్ని ఈ కంపెనీలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications