- జెట్ ఎయిర్‌వేస్ ఫెయిల్యూర్ స్టోరీ
- 1993లో ప్రారంభమైన జెట్.. పదేళ్లకే కష్టాలు కోరి తెచ్చుకుంది
- ఖర్చులు పెరిగాయ్, ప్యాసింజర్లు దూరమయ్యారు
- జనవరి మీటింగ్‌లో నరేష్ గోయెల్ చేసిన పని మరింత కష్టం తెచ్చింది
జెట్ ఎయిర్‌వేస్.. ఇప్పుడు కింగ్‌ఫిషర్ బాటలో పయనిస్తోంది. ఒకప్పుడు దేశంలోని ప్రీమియం ఎయిర్‌లైన్స్ సంస్థగా ఓ వెలుగువెలిగిన సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి సహాయం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇక జెట్ ఎయిర్‌వేస్ మూసివేత దాదాపుగా ఖాయమనిపించేలా ఉందని రుణదాతలు కూడా అందినకాడికి వస్తే చాలనే స్థితికి వచ్చేశారు. ఇంతకీ ఎందుకు ఈ దుస్థితి జెట్ ఎయిర్‌కు వచ్చింది ? రుణదాతల మీటింగ్‌లో ఆ రోజు నరేష్ గోయల్ చేసిన ఓ దుందుడుకు పనే ఈ స్థితి తెచ్చిందా ? ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

1993లో గాల్లోకి లేచింది
జెట్ ఎయిర్వేస్ విమానయాన సంస్థను నరేష్ గోయెల్, అతని భార్య అనితా గోయెల్ 1993లో ప్రారంభించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్‌గా ఎదగాలనే ఉద్దేశంతో క్వాలిటీ సర్వీస్, ఆన్ టైం పర్ఫార్మెన్స్‌తో జెట్‌ను తీర్చిదిద్దారు. దీన్ని జనాలు కూడా బాగా రిసీవ్ చేసుకోవడంతో జెట్ ఎయిర్వేస్ ఓ వెలుగు వెలిగింది. అయితే అప్పటివరకూ డొమెస్టిక్ రూట్లలో సక్సెస్‌ఫుల్‌గా వ్యాపారాన్ని నిర్వహించిన నరేష్ గోయెల్ దృష్టి విదేశీ రూట్లపై పడింది. అదే పతనానికి తొలి అడుగు అంటారు సన్నిహితులు. ఇండస్ట్రీ నిపుణులు వారిస్తున్నా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా 22 వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను ఆర్డర్ చేయం, అవి ఏడాదిన్నర డెలివర్ కావడం కటకట మొదలైందని చెబ్తారు. పదేళ్ల పాటు బాగా పేరుతెచ్చుకున్న జెట్ ఎయిర్.. 2006 నుంచి కష్టాలను కొనితెచ్చుకుంది.
సహారా ముంచేసింది
ముందే అంతంతమాత్రంగా ఉన్న సమయంలో సహారా ఎయిర్ లైన్స్‌ను రూ.1450 కోట్లకు 2007లో కొనుగోలు చేశారు నరేష్ గోయెల్. ఆ సంస్థ పాత విమానాలు జెట్ ఎయిర్ కార్పొరేట్ స్ట్రాటజీలో సెట్ కాలేదు. దీంతో డబుల్ ఎఫెక్ట్ పడింది. అంత డబ్బుపెట్టిన కొన్న సహారా నెగిటివ్‌గా మారడంతో భారం మరింత పెరిగిపోయింది. ఈలోపు లో కాస్ట్ క్యారియర్ ఇండిగో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ ఛార్జీలతో ప్యాసింజర్లను ఆకట్టుకుంది. దీంతో అటు కాంపిటీషన్ పెరగడం, ఇటు ప్యాసింజర్లు తగ్గడం, ఖర్చులు పెరిగిపోవడంతో జెట్ ఎయిర్ ఉక్కిరిబిక్కిరైపోయింది.
2013లోనే వీళ్ల పని దాదాపుగా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో అబుదాబీకి చెందిన ఏతిహాద్ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో అప్పటికి గట్టెక్కినా ఖర్చులు తగ్గించుకోకపోవడంతో నానాటికీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. కాంపిటీషన్‌లో భాగంగా రేట్లను పెంచకపోవడం మరింతగా ఇబ్బందిపెట్టింది. అలా మొదలైన పతనం ఇప్పుడు అంచుకు చేరింది. ఏ క్షణాన్నైనా కూలిపోయేందుకు సిద్ధమైంది.
ఆ రోజు ఏం జరిగింది
ఈ ఏడాది జనవరిలో ఓ రోజు నరేష్ గోయెల్‌తో ఎస్బీఐ సహా వివిధ రుణదాతలు భేటీ అయ్యారు. అప్పటివరకూ ఉన్న ఆర్థిక స్థితి గురించి వాళ్లంతా గుచ్చిగుచ్చి నరేష్‌ను అడిగారు. కష్టకాలం నుంచి బయటపడేందుకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో స్పష్టంగా చెప్పకపోతే తమ విమానాలను వెనక్కి తీసేసుకుంటామని ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో సాధారణంగా కూల్‌గా ఉండే నరేష్ గోయెల్ ఒక్కసారిగా తన టెంపర్ కోల్పోయారట. మీటింగ్‌లో ఓ టేబుల్‌పై బలంగా తన చేతిని గుద్ది అసహనాన్ని వ్యక్తం చేశారట. దుబాయ్, సింగపూర్, డబ్లిన్ దేశాల నుంచి వచ్చిన రుణదాతలకు ఈ చేష్ట ఎంత మాత్రమూ నచ్చలేదని, అప్పులిచ్చి ఇలా తిప్పలుపడడం ఏంటని వాళ్లలో వాళ్లు మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వచ్చారని తెలిసింది. అప్పటి నుంచి అటు గోయెల్‌కు ఇటు రుణదాతలకూ మధ్య వ్యవహారం పొసగలేదని, అదే పతనానికి కారణమైందని సన్నిహితులు చెబ్తారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications