ఒక్క అడుగ ముందుకు.. మరో అడుగు వెనక్కి అనేట్టు ఉంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ట్రెండ్. నిన్న తేరుకున్న మార్కెట్లు మళ్లీ కిందికి జారాయి. నిఫ్టీ 11600 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రధానంగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, హెచ్ డి ఎఫ్ సితో పాటు రిలయన్స్ స్టాక్స్ మార్కెట్లను పడోదోశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి వచ్చిన నెగిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా ఒడిదుడుకులు మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువుగా ఉంది. చివరకు నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 11584 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 354 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయింది.
రియాల్టీ, ఫార్మా, ఆటో రంగ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ సెల్లింగ్ వచ్చింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ దిగాలు పడ్డాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ అర శాతం నష్టపోతే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 0.41 శాతం లాభపడింది.

టాటా మోటార్స్‌కు ఊరట
టాటా మోటార్స్ స్టాక్ వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసింది. జెఎల్ఆర్ గ్లోబల్ సేల్స్ 5 శాతం తగ్గిందనే వార్తలు వచ్చినప్పటికీ వీటిని మార్కెట్లు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు స్టాక్ 4.7 శాతం లాభంతో రూ.216 దగ్గర క్లోజైంది.
ఐబీ రియల్ బూమ్.. బూమ్..
ఐబీ హౌసింగ్‌లో లక్ష్మీవిలాస్ బ్యాంక్ విలీనం వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ రెండు స్టాక్స్ కంటే వేగంగా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ దూసుకుపోతోంది. 20 రోజుల యావరేజ్‌తో పోలిస్తే 6 రెట్లు ఎక్కువగా ట్రేడింగ్ వాల్యూమ్ నమోదైంది. ఈ రోజు కూడా స్టాక్ 10.2 శాతం లాభాలతో రూ.119.15 దగ్గర క్లోజైంది.
లక్ష్మీవిలాస్‌లో నష్టాలే నష్టాలు
ఐబీ హౌసింగ్ విలీన ఎఫెక్ట్ నేపధ్యంలో ఒక్క రోజు లాభపడిన స్టాక్ వరుసగా రెండు రోజుల నుంచి నష్టాల బాటలోనే ఉంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా నిధుల సమీకరించే యోచనలో ఉన్నట్టు బ్యాంక్ వెల్లడించడంతో పాటు రేపు బోర్డ్ మీట్ కూడా ఉన్న నేపధ్యంలో స్టాక్ నెగిటివ్‌గా రియాక్ట్ అయింది. చివరకు 4.5 శాతం నష్టంతో రూ.88.35 దగ్గర క్లోజైంది.
పాలీక్యాబ్ సూపర్ సక్సెస్
తాజాగా వచ్చిన పాలీక్యాబ్ ఐపీఓ సూపర్ సక్సెస్ అయింది. ఏకంగా 52 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధానంగా హెచ్ ఎన్ ఐ, క్యూఈబీ నుంచి అనూహ్యమైన డిమాండ్ రావడంతో ఈ స్థాయి సబ్‌స్క్రిప్షన్ సాధ్యమైంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 5 రెట్ల వరకూ అధిక స్పందన వచ్చింది.
స్మాల్ క్యాప్ గెయినర్స్
గత కొద్దికాలం నుంచి నీరసంగా ట్రేడవుతూ వస్తున్న పిసి జ్యువెలర్స్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్, రెయిన్ ఇండస్ట్రీస్, ఇన్ఫీబీమ్ స్టాక్స్ 5 శాతానికి పైగా లాభాలతో ముగిశాయి. హోటల్ స్పేస్‌లో చాలెట్ హోటల్స్, ఈస్ట్ ఇండియా హోటల్స్ 4 శాతం, మ్యాక్ హోటల్ 12 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications