సెప్టెంబర్ 9, 2016 నుంచి రాజధాని, శతాబ్ధి, దురంతో వంటి ప్రీమియం రైళ్లలో ఇండియన్ రైల్వేస్ ఫ్లెక్సీ ఫేర్‌ను ఇంట్రొడ్యూస్ చేసింది. మొత్తం 142 ప్రీమియం రైళ్లలో 44 రాజధాని ఎక్స్‌ప్రెస్, 46 శతాబ్ది ఎక్స్‌ప్రెస్, 52 దురంతో ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. ఇందులో ప్లెక్సీ ఫేర్ అమలవుతోంది. అంటే ఈ రైళ్లలో బెర్త్స్ ఆక్యుపెన్సీ (టిక్కెట్ కొనుగోళ్లు) పెరిగిన కొద్ది కొంత శాతం ధర పెరుగుతుంది. ఇప్పుడు వేసవి కాలం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. వేసవి న్యూఢిల్లీ నుంచి చండీగఢ్ వంటి పలు రైళ్లలో ఫ్లెక్సీ రేట్ వసూలు చేయరు.
చండీగఢ్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లో ఇండియన్ రైల్వేస్ ఫ్లెక్సీ ఫేర్‌ను తొలగించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇండియన్ రైల్వేస్ తాజా రూల్స్ ప్రకారం చండీగఢ్ శతాబ్ధి రైల్వే ఫిక్స్‌డ్ రేట్ రూ.575 నుంచి రూ.595 మధ్య ఉంటుంది. ఇది ఢిల్లీ నుంచి రాత్రి ఏడుంపావుకు ప్రారంభమై చండీగఢ్ జంక్షన్‌కు రాత్రి పది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది. దీని ధర రూ.595. అంతకుముందు, చండీగఢ్ శతాబ్ధి ఫేర్ రూ.850 నుంచి 900 వరకు ఉంది.

గత ఏడాది దీపావళి పర్వదినం సమయంలో ఇండియన్ రైల్వేస్ 15 ప్రీమియం రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్‌ను తొలగించాయి. ఇతర ప్రీమియం రైళ్లలోను స్లాబ్స్ తగ్గించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరికొన్ని రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మర్‌లో పలు ట్రైన్లలో ఫ్లెక్సీ ఫేర్ ఉండదు.
ట్రెయిన్ నెంబర్ 12014 అమృత్‌సర్ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12005 కాల్కా శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12018 డెహ్రాడూన్ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12016 అజ్మీర్ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12025 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12020 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12030 స్వర్ణ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12026 పుణే శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12032 అమృత్ సర్ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12031 అమృత్ సర్ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12041 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12039 కేజీఎం ఎన్డీఎల్ఎస్ ఎస్‌హెచ్‌టీ
ట్రెయిన్ నెంబర్ 12045 ఎన్డీఎల్ఎస్ సీడీజీ శతాబ్ధి
ట్రెయిన్ నెంబర్ 12042 ఎన్‌జేపీ హెచ్‌డబ్ల్యూహెచ్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12213 దురంతో ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12046 సీడీజీ ఎన్డీఎల్ఎస్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12219 ఎస్సీ దురంతో ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12214 వైపీఆర్ దురంతో ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12224 ఈఆర్ఎస్ ఎల్‌టీటీ దురంతో
ట్రెయిన్ నెంబర్ 12223 ఎల్‌టీటీ ఈఆర్ఎస్ దురంతో
ట్రెయిన్ నెంబర్ 12228 ముంబై దురంతో
ట్రెయిన్ నెంబర్ 12227 ఇండోర్ దురంతో
ట్రెయిన్ నెంబర్ 12240 జేపీ ఎంఎంసీటీ దురంతో
ట్రెయిన్ నెంబర్ 12239 జైపూర్ దురంతో
ట్రెయిన్ నెంబర్ 12244 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12243 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12437 రాజధాని ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12278 శతాబ్ధి ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 12442 బిలాస్పూర్ రాజధాని
ట్రెయిన్ నెంబర్ 12441 బీఎస్పీ ఎన్డీఎల్ఎస్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ట్రెయిన్ నెంబర్ 22414 ఎన్జీఎం ఎంఏవో ఆర్ఏజే
ట్రెయిన్ నెంబర్ 12453 ఆర్ఎన్సీ ఎన్డీఎల్సీ రాజధాని ఎక్స్‌ప్రెస్


Click it and Unblock the Notifications