మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం గం.9.15 నిమిషాలకు సెన్సెక్స్ 52 పాయింట్లు నష్టపోటి 38,887 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 11,643 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.36 సమయంలో సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 38,886 వద్ద, నిఫ్టీ 11,661 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.28 పైసల వద్ద ప్రారంభమైంది. మంగళవారం నాడు 69.29 పైసల వద్ద క్లోజ్ అయింది. ఆ తర్వాత పదిన్నరకు బీఎస్ఈ 3 పాయింట్లు లాభపడి 38,940 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 11675 వద్ద ట్రేడ్ అయింది.
హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభమయ్యాయి. నిఫ్టీ రియాలిటీ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగాయి. ఐఎంఎఫ్ వృద్ధిరేటును తగ్గించడం ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో ఆసియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

స్టాక్‌మార్కెట్లు మంగళవారం మధ్యాహ్నం అనూహ్యంగా లాభాల్లోకి వచ్చాయి. ప్రభుత్వ బ్యాంకింగ్, ఆటో షేర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో కళకళలాడాయి. ప్రయివేటు రంగ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద షేర్లు రాణించాయి. ఆరంభ ట్రేడింగ్‌లో నష్టాల్లో కనిపించినప్పటికీ, సానుకూల ఐరోపా సంకేతాలతో మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల బాట పట్టాయి.


Click it and Unblock the Notifications